రాజా చెయ్యి వేస్తే.. ఈ టాక్ జోరుగా వినిపిస్తోందిగా..!
రాజా చెయ్యి వేస్తే.. అది రాంగై పోదులేరా.. అనే పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూటమిలోని ఓ కీలక పార్టీ నేతలు ఇదే పాట పాడుతున్నారు.
By: Garuda Media | 8 Feb 2026 6:00 AM ISTరాజా చెయ్యి వేస్తే.. అది రాంగై పోదులేరా.. అనే పాట గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు కూటమిలోని ఓ కీలక పార్టీ నేతలు ఇదే పాట పాడుతున్నారు. సీమలోని రెండు-మూడు జిల్లాల్లో ఇదే చర్చ సాగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజాలు ఎక్కువగా ఉన్నారన్నది పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. చిత్రం ఏంటంటే.,. సొంత పార్టీ నాయకులతో కంటే కూడా.. సదరు రాజాలు.. పొరుగు పార్టీ వారితో కలివిడిగా ఉంటున్నారట!.
పొరుగు పార్టీతో యుద్ధం చేస్తున్న కూటమి పార్టీలకు.. సదరు రాజాలు కంట్లో నలుసుగా మారుతున్నారు. పోనీ.. హెచ్చరిద్దామంటే.. మరింత సెగ పెరుగుతుందేమో.. దీనిని ఆసరా చేసుకుని వైసీపీ దూకుడు పెంచి.. చీలిక రాజకీయాలకు తెరదీస్తుందన్న ఆవేదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజాల విషయం తెలిసి కూడా.. మౌనంగా ఉంటున్నారు. అంతర్గత చర్చల్లో పార్టీల సీనియర్లు పట్టించుకోవాలని సూచిస్తు న్నారు. ఇది మరీ చిత్రంగా ఉందని చెబుతున్నారు.
ఎలాగంటే.. అసలు వివాదాలు.. సదరు రాజాలతో పడుతున్నది సీనియర్లే. వారినే రంగంలోకి దింపి.. మీదే బాధ్యత.. వారితో పనిచేయించాలని చెబుతుండడంతో నాయకులు విసిగిపోతున్నారు. ఇక, ఉమ్మడి తూ ర్పు గోదావరి జిల్లాలోనూ ఇద్దరు రాజాలు పేట్రేగుతున్నారు. వీరికి సొంత పార్టీ నాయకులతో అస్సలు పడ డం లేదు. కయ్యానికి కాలుదువ్వేందుకు కూడారెడీగా ఉన్నారట. ఈ పరిణామాలతో నాయకులు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారు.
ఏం చేస్తున్నారు..?
ఇసుక, మట్టి కామన్. ఇవి కాకుండా.. బెల్టు షాపులను రాజాలు నిర్వహిస్తున్నారు. ఈ వ్యవహారంలో కమీష న్లు తమకు కూడా వస్తాయేమోనన్న ఆశ కొందరిలో ఉన్నా.. వీరు వారిని లెక్కచేయడం లేదు. పైగా.. వారి ఇలాకాల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. దీనికి పొరుగు పార్టీ నేతల సహకారం తీసుకుంటున్నా రట. తూర్పులో వైసీపీ నుంచి కూటమిలో చేరిన ఒక నేత ఈ వ్యవహారాన్ని ముందుండి నడిపిస్తున్నారన్న వాదన బలంగా ఉంది. ఆయనను హెచ్చరించేందుకు ఎవరూ సాహించలే కపోతున్నారట. ఎందుకంటే.. ఆయన సొంత పార్టీలోనే ఎగస్పార్టీగా వ్యవహరించిన చరిత్ర ఉందని గుర్తు చేసుకుంటున్నారు. ఇదీ.. సంగతి!!.
