Begin typing your search above and press return to search.

మంత్రులు-మంట‌లు.. సెగ పెరుగుతోంది.. !

అదేస‌మయంలో ఈ ప‌థ‌కాన్ని పీ-4కు అనుసంధానించామ‌ని కూడా చంద్ర‌బాబు చెప్పారు. అంటే.. మార్గ ద‌ర్శ‌కులు ఎవ‌రైతే ఉన్నారో.. వారే మ‌హిళ‌ల‌కు ఆడ‌బిడ్డ నిధి కింద కొంత మొత్తం చెల్లిస్తార‌న్న‌ది చంద్ర బాబు చెప్పిన మాట‌.

By:  Tupaki Desk   |   25 July 2025 8:30 AM IST
మంత్రులు-మంట‌లు.. సెగ పెరుగుతోంది.. !
X

కూట‌మి ప్ర‌భుత్వానికి.. మంత్రులు ప్ర‌త్య‌క్ష వాయిస్‌. సీఎం చంద్ర‌బాబు చెప్పిన మాట‌కు ఎంత విలువ ఉంటుందో.. దాదాపు అంతే వాల్యూ మంత్రుల‌కు కూడా ఉంటుంది. దీనిని బ‌ట్టి.. మంత్రులు అనుస‌రిం చాల్సి పాత్ర‌ను ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. కానీ.. మంత్రుల్లో కొంద‌రు.. మాత్రం ఈ విష‌యాన్ని విస్మ‌రిస్తున్నార‌న్న‌ది చ‌ర్చ‌గా మారింది. అందునా.. సీనియ‌ర్ నాయ‌కులు.. చంద్ర‌బాబుతో స‌న్నిహితంగా ఉండే వారు కూడా.. దారి త‌ప్ప‌డం.. అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ముఖ్యంగా ప్ర‌భుత్వానికి క‌ళ్లు చెవులు అన‌ద‌గిన మంత్రులే నోరు చేసుకుంటున్నారు. దీనివ‌ల్ల వారి ప‌రిస్థి తి.. వారి ఇమేజ్ త‌గ్గుతుందా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. పార్టీకి, ప్ర‌భుత్వానికి ఇబ్బందిక‌ర ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌ని అంటున్నారు. ఇటీవ‌ల మంత్రి అచ్చెన్నాయుడు.. మంత్రి నారాయ‌ణలు ఇద్ద‌రూ కూడా నోరు చేసుకున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు సూప‌ర్ సిక్స్ హామీల్లో ఒక‌టైన `ఆడ‌బిడ్డ నిధి` వ్య‌వ‌హారంపై మంత్రులు ఎవ‌రూ మాట్లాడొద్ద‌ని సీఎం చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

అదేస‌మయంలో ఈ ప‌థ‌కాన్ని పీ-4కు అనుసంధానించామ‌ని కూడా చంద్ర‌బాబు చెప్పారు. అంటే.. మార్గ ద‌ర్శ‌కులు ఎవ‌రైతే ఉన్నారో.. వారే మ‌హిళ‌ల‌కు ఆడ‌బిడ్డ నిధి కింద కొంత మొత్తం చెల్లిస్తార‌న్న‌ది చంద్ర బాబు చెప్పిన మాట‌. అందుకే.. ఈ విష‌యాన్ని ఇత‌రులు ఎవ‌రూ జోక్యం చేసుకోవ‌ద్ద‌ని కూడా ఆయ‌న తేల్చి చెప్పారు. కానీ, మంత్రి అచ్చెన్న ఈ ప‌థ‌కంపై అన‌వ‌స‌రంగా ప్ర‌స్తావిస్తూ.. దీనిని అమ‌లు చేయాలం టే.. రాష్ట్రాన్ని అమ్యేయాల‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీనిని ప్ర‌తిప‌క్షం తీవ్ర‌స్థాయిలో హైలెట్ చేసిం ది. ఇది స‌ర్కారుకు తీవ్ర ఇబ్బందిని తెచ్చింది.

అంతేకాదు.. ప్ర‌జ‌లు మ‌రిచిపోయార‌ని అనుకున్న ఈ ప‌థ‌కాన్ని మంత్రి అచ్చెన్నాయుడు.. గుర్తు చేసి మరీ కెలికార‌న్న చ‌ర్చ కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఇక‌, మంత్రి నారాయ‌ణ అమ‌రావ‌తి నిర్మాణాల విష‌యం లో ఇంజ‌నీర్‌పై చేసిన వ్యాఖ్య‌లు కూడా అంతే జోరుగా వైర‌ల్ అయ్యాయి. విజ్ఞుడు, విద్యావంతుడైన మం త్రి నారాయ‌ణ.. ఇంజ‌నీర్‌పై స్టుపిడ్‌.. గెటౌట్‌.. యూజ్‌లెస్ ఫెలో అంటూ విరుచుకుప‌డ‌డంపై మేధావులు సైతం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇది స‌రికాద‌ని.. ఫ్రెస్టేష‌న్‌ను ఇలా ప్ర‌ద‌ర్శించ‌డం వ‌ల్ల స‌ర్కారుకు మేలు జ‌ర‌గ‌ద‌ని చెబుతున్నారు. మ‌రి మంత్రుల తీరు మారుతుందో లేదో చూడాలి.