Begin typing your search above and press return to search.

సీఎం లిద్దరికీ గుడ్ న్యూస్ చెప్పిన లేటెస్ట్ సర్వే... ఇంత వేరియేషనా?

ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   22 Oct 2023 4:08 AM GMT
సీఎం లిద్దరికీ గుడ్ న్యూస్ చెప్పిన లేటెస్ట్ సర్వే... ఇంత వేరియేషనా?
X

ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో రాజకీయాలు వేడెక్కిన సంగతి తెలిసిందే. అధికార బీఆరెస్స్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాల్లో బిజీ అయిపోగా.. తొలివిడత లిస్ట్ విడుదలపై బీజేపీ కసరత్తులు చేస్తుంది. మరోపక్క చంద్రబాబు రజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా... ఏపీలో అధికార వైసీపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలు చాపకింద నీరులా జరిగిపోతున్నాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక సర్వే విడుదలయ్యింది.

ఎన్నికలు దగ్గరపడుతున్నాయంటే.. పార్టీలు, నాయకులు సందడితో పాటు సర్వేల సందడి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో చాలా సర్వేలు ప్రజానాడికి చాలా దగ్గరగా కూడా ఉంటుంటాయి! ఈ క్రమంలో తాజాగా సర్వే ఏజెన్సీ సి.ఎన్‌.ఎక్స్‌ తో కలిసి ఇండియా టివి నిర్వహించిన తాజా ఒపీనియన్ పోల్ తెలుగు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలపై పబ్లిక్ పల్స్ ఫలితాలు వెల్లడించింది!

అవును... త్వరలో జరగబోయే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది ప్రారంభంలో జరగబోయే ఏపీ ఎన్నికల ఫలితాలపై సర్వే ఫలితాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... తెలంగాణలో కె చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆరెస్స్) మళ్లీ అధికారంలోకి వస్తుందని తెలిపింది. ఇదే సమయంలో ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌ లో తిరిగి అధికారంలోకి వస్తుందని అంచనా వేసింది.

తాజా సర్వే ఫలితాలు రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అధికారంలోనే ఉన్న పార్టీలే వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అయితే గతంలో వచ్చిన సీట్ల సంఖ్య కాస్త తగ్గే అవకాశం ఉందని మాత్రం స్పష్టం చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలో బీఆరెస్స్ మెజారిటీ మార్కును దాటే అవకాశం ఉన్నందున కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని సర్వేలో తేలింది.

తాజా ఫలితాల ప్రకారం... తెలంగాణలో బీఆరెస్స్ 70 సీట్లు, కాంగ్రెస్ 34, బీజేపీ 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా... అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఏఐఎంఐఎం 7 స్థానాలను నిలబెట్టుకోనుందని సర్వే ఫలితాలు వెల్లడించాయి. ఇక ఇందులో... ఉత్తర తెలంగాణలో బీఆరెస్స్ తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుంది. ఈ క్రమంలో... ఆ ప్రాంతంలోని 49 అసెంబ్లీ స్థానాల్లోనూ 27 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌ కు 17 సీట్లు వస్తాయని, బీజేపీకి 4 సీట్లు రావచ్చని అంచనా! అదేవిధంగా... దిగువ తెలంగాణ ప్రాంతం విషయానికొస్తే... ఇక్కడ బీఆరెస్స్ మరింత ఎకువగా ఆధిక్యాన్ని ప్రదర్శించబోతోందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... 42 అసెంబ్లీ స్థానాలు ఉండగా, బీఆరెస్స్ కనీసం 30 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా వేసింది.

ఇక, కాంగ్రెస్‌ 12 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ, ఏఐఎంఐఎంలు ఖాతాలు ఓపెన్ చేసే అవకాశం లేదని ఈ ఫలితాలు చెబుతున్నాయి! ఇదే సమయంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పనితీరుపై జరిగిన సర్వేలే... 45 శాతం మంది సీఎం గా కేసీఆర్ ఫెర్మార్మెన్స్ బాగుందని అభిప్రాయపడ్డారని, 15 శాతం మంది ఓటర్లు యావరేజ్‌ గా ఉందని చెప్పారని ఫలితాలు చెబుతున్నాయి! ఇక మిగిలిన 40 శాతం మంది ఓటర్లు ఆయన పనితీరు బాగాలేదని అభిప్రాయపడ్డారని తెలుస్తుంది.

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే... ఆ ప్రాంతంలో అక్టోబర్ 20న జరిగిన సర్వేలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీకి రాష్ట్రంలో 46 శాతం ఓట్లు రావచ్చని, టీడీపీకి 42 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది ఈ తాజా సర్వే. ఇదే క్రమంలో... వైసీపీకి 18 లోక్‌ సభ స్థానాలు వస్తాయని, టీడీపీకి 7 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. ఇదే క్రమంలో... ఏపీలో కాంగ్రెస్, బీజేపీలకు సున్నా ఫలితాలు వస్తాయని ఈ సర్వే చెబుతోంది!