Begin typing your search above and press return to search.

విజయ్ కోరిక.. ఆయనలో కలిగిన మార్పు.. భవిష్యత్తు బంగారు మయం!

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను నటుడు విశాల్ రీసెంట్‌గా మర్యాదపూర్వకంగా కలిశారు.

By:  Madhu Reddy   |   16 Jun 2026 6:56 PM IST
విజయ్ కోరిక.. ఆయనలో కలిగిన మార్పు.. భవిష్యత్తు బంగారు మయం!
X

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం అందరి హృదయాలను గెలుచుకుంటోంది. తనను మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చిన ప్రముఖ నటుడు విశాల్ తెచ్చిన సాంప్రదాయ శాలువా, బొకేలను ఆయన సున్నితంగా తిరస్కరించారు. వాటికి పెట్టే ఖర్చుతో పేద పిల్లల చదువుకు సాయం చేయాలని కోరారు. సీఎం మాటలతో స్ఫూర్తి గా తీసుకున్న విశాల్.. ముగ్గురు పేద విద్యార్థినుల చదువు బాధ్యతలను స్పాన్సర్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ గ్రేట్ మూమెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ వివరాలు చూద్దాం..

సీఎం విజయ్‌తో విశాల్ ముచ్చట్లు:

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను నటుడు విశాల్ రీసెంట్‌గా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మీటింగ్ తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, విజయ్ అన్నను కలవడం ఒక ‘ఫ్యాన్ బాయ్ మూమెంట్’ అని విశాల్ చెప్పుకొచ్చారు. గతంలో కరుణానిధి, జయలలిత, స్టాలిన్, ఉదయనిధి వంటి ఎందరో రాజకీయ నాయకులను కలిసినప్పటికీ.. విజయ్ అన్నను కలవడంలో ఉన్న ఆత్మీయతే వేరని విశాల్ ఎమోషనల్ అయ్యారు.

శాలువా వద్దు.. చదువు ముద్దు:

సాధారణంగా పెద్ద నాయకులను కలవడానికి వెళ్లినప్పుడు శాలువాలు కప్పడం, బొకేలు ఇవ్వడం ఒక ఆనవాయితీ. విశాల్ కూడా అలాగే వెళ్లారు. కానీ సీఎం విజయ్ మాత్రం వాటన్నింటినీ సున్నితంగా పక్కన పెట్టేశారు. శాలువాలు, బొకేల వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని.. వాటికి పెట్టే ఖర్చుతో ఎవరైనా పేద బాలికల చదువుకు సాయం చేస్తే బాగుంటుందని విజయ్ ఒక మంచి సలహా ఇచ్చారు.

ముగ్గురు అమ్మాయిల చదువుకు భరోసా:

సీఎం విజయ్ చెప్పిన మాట విశాల్ మనసుకు బలంగా తాకింది. వెంటనే ఆయన ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. బొకేలు, శాలువాలకు అయ్యే ఖర్చును తమిళనాడులోని ముగ్గురు నిరుపేద విద్యార్థినుల విద్యాభ్యాసానికి కేటాయించారు. ఇక సీఎం విజయ్ పేరు మీదుగానే ఆ మొత్తాన్ని విరాళంగా అందించి, ఆ ముగ్గురు అమ్మాయిల చదువు బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నారు.

బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని:

ఈ సాయం అందుకున్న వారిలో పుష్ప అనే విద్యార్థిని కూడా ఉంది. ఆమె ప్రస్తుతం బిఎస్సీ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది. ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్న ఆమె తో పాటు మరో ఇద్దరు అమ్మాయిల కాలేజీ ఫీజులను, చదువు ఖర్చులను ఇకపై విశాల్ తన సొంత డబ్బులతో భరించబోతున్నారు. సీఎం విజయ్ చూపిన బాటలో విశాల్ చేసిన ఈ సాయంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

రాజకీయాల్లో మార్పు అంటే పెద్ద పెద్ద స్పీచ్‌లు ఇవ్వడం కాదు.. ఇలాంటి చిన్న చిన్న పనులతోనే సమాజంలో పెద్ద మార్పు తీసుకురావచ్చని తమిళనాడు సీఎం విజయ్ నిరూపించారు. అలాగే ఆయన మాటను గౌరవించి ముగ్గురు విద్యార్థినుల జీవితాల్లో వెలుగులు నింపిన నటుడు విశాల్ నిజంగా గ్రేట్ అని చెప్పాలి. ఈ ఇద్దరు స్టార్స్ చేసిన పని మిగతా వారికి కూడా ఒక మంచి స్ఫూర్తిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.