Begin typing your search above and press return to search.

మద్యం దుకాణాలపై విజయ్ 'సర్జికల్ స్ట్రైక్'.. వాటన్నింటి మూసీ వేతకు ఆదేశం..

కుర్చీలో కూర్చున్నారో లేదో.. మొదటి దెబ్బ కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందల వైన్ షాపులను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

By:  Tupaki Political Desk   |   12 May 2026 11:08 AM IST
మద్యం దుకాణాలపై విజయ్ సర్జికల్ స్ట్రైక్.. వాటన్నింటి మూసీ వేతకు ఆదేశం..
X

శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ‘ఒకే ఒక్కడు’ సినిమా చూశాం కదా.. అర్జున్ ఒక్క రోజు సీఎంగా ఏం చేయలేరని అంతా అనుకుంటారు.. కానీ ఒక్క రోజులో రాష్ట్రాన్ని కడిగి పాడేస్తాడు. ఇదే తీరున తమిళనాడులో విజయ్ పాలన సాగుతోంది. కుర్చీలో కూర్చున్నారో లేదో.. మొదటి దెబ్బ కొట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందల వైన్ షాపులను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి తరలించాలి.. లేదంటే మూసేయాలి.. రెండు వారాలు మాత్రమే గడువు విధించాడు. మొదటి దెబ్బనే మాస్టర్ స్ట్రోక్.

ప్రభుత్వ ఖాజానాకు ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే వాటిల్లో మొదటిది లిక్కర్. తాగుబోతులు ఎంత ఎక్కువైతే అన్ని వైన్ షాపులు పెరుగుతాయి. వైన్ షాపులు పెరిగే కొద్దీ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి లిక్కర్ బిజినెస్ ను ప్రభుత్వాలు కాపాడుతాయి. కానీ తమిళనాడులో విజయ్ ప్రభుత్వం మాత్రం వైన్ షాపులను మూయించి వేసింది.. రెండు వారాలు గడువు ఇచ్చి మరీ తొలగించాలని ఆదేశించింది.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతోనే దళపతి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వెంటనే తీసుకున్న నిర్ణయం తమిళనాడు రాజకీయాలు, సామాన్య ప్రజల్లో పెద్ద చర్చకు దారితీసింది. పారితోషికం రూపంలో వచ్చే వందల కోట్లను వదిలి ప్రజాసేవలోకి వచ్చిన ఆయన, ఇప్పుడు ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే ముఖ్యమని నిరూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యాసంస్థలు, ప్రార్థనా మందిరాల వద్ద మద్యం దుకాణాల వల్ల తలెత్తే ఇబ్బందులను గమనించి, పక్కా ప్రణాళికతో ఈ చర్యలు తీసుకోవడం విశేషం.

తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజుల్లోనే విజయ్ తనదైన మార్క్ పాలనను చూపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు అసౌకర్యంగా ఉన్న మద్యం దుకాణాలను తొలగించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.

500 మీటర్ల నిబంధన

ప్రజల విన్నపాలను, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ప్రధాన బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలన్నింటినీ వెంటనే మూసివేయాలని ఆదేశించారు. ఈ నిబంధన కింద రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 717 మద్యం దుకాణాలను గుర్తించి, వాటి లైసెన్స్‌లను రద్దు చేయడమో లేదా వాటిని అక్కడి నుంచి తరలించడమో చేయాలని స్పష్టం చేశారు.

2. టీఏఎస్ఎంఏసీపై ప్రభావం

తమిళనాడులో మద్యం వ్యాపారం అంతా ప్రభుత్వ ఆధీనంలోని సంస్థ ద్వారానే జరుగుతుంది. ఈ వైన్ షాపులన్నీ తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాలకు మద్యం ద్వారా భారీగా ఆదాయం సమకూరుతుంది. అయితే, ఆదాయం తగ్గినప్పటికీ ప్రజల భద్రత, విద్యార్థుల భవిష్యత్తు, గుడికి వచ్చే భక్తుల భక్తి కోసం విజయ్ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు.

ప్రజా స్పందన

ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా విద్యాసంస్థలు, గుడుల వద్ద మద్యం దుకాణాల వల్ల ఇబ్బందులు పడే మహిళా లోకం ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోంది. పళనిస్వామి నేతృత్వంలోని 'ది రూట్' సంస్థ ఈ నిర్ణయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, విజయ్ ని 'ప్రజల ముఖ్యమంత్రి'గా అభివర్ణిస్తోంది.

ఎన్నికల ప్రచారంలో మద్యం నియంత్రణపై ఇచ్చిన హామీలను విజయ్ అమలు చేయడం ప్రారంభించారు. 717 షాపుల మూసివేత అనేది కేవలం ఆరంభం మాత్రమేనని, దశలవారీగా మరిన్ని సంస్కరణలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.