Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో హై అలర్ట్.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిభిరాలపై మెరుపు దాడి చేసింది.

By:  Tupaki Desk   |   7 May 2025 5:57 AM
హైదరాబాద్  లో హై అలర్ట్.. సీఎం రేవంత్  కీలక వ్యాఖ్యలు!
X

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద శిభిరాలపై మెరుపు దాడి చేసింది. ఉగ్ర మూకల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని క్షిపణిదాడులు చేసింది. ఈ దాడిలో సుమారు 80 - 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు చెబుతున్నారు. ఈ సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు.

అవును... పాకిస్థాన్ లోని ఉగ్ర శిబిరాలపై మన సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఆపరేషన్ పట్ల భారత పౌరుడిగా గర్వంగా ఉందని అన్నారు. దేశ పౌరులుగా అందరం ఏకతాటిగా నిలిచి ఐక్యత చాటాల్సిన సమయం ఇది అంటూ ‘జైహింద్’ అని స్పందిస్తూ.. ఎక్స్ వేదికగా సీఎం పొస్ట్ పెట్టారు.

ఇదే సమయలో దేశవ్యాప్తంగా ఉగ్రవాదులపై భారత సైన్యం మెరుపుదాడులు కొనసాగుతున్న నేపథ్యంలో... హైదరాబాద్ వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంగా ఉన్న తరుణంలో సీఎం రేవంత్ అధికార యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అత్యవసర సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నారు!

ఈ సమీక్షలో ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫైర్ సహా ఇతర కీలక విభాగాల ఉన్నతాధికారులు పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఫోన్ చేసిన సీఎం.. వెంటనే హైదరాబాద్ కు రావాలని సూచించినట్లు తెలుస్తోంది. సాయంత్రం జరగనున్న మాక్ డ్రిల్ ను సీఎం రేవంత్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.

అంతకంటే ముందు... దేశ రక్షణకు సంబంధించి హైదరాబాద్ కీలక కేంద్రంగా ఉండటంతో.. కేంద్రంతో సమన్వయానికి రాష్ట్ర స్థాయి సిద్ధత అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా.. ఏ చిన్న అనూహ్య పరిణామాలను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండేలా రాష్ట్ర యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు!