Begin typing your search above and press return to search.

తాటి కల్లు టేస్ట్ చేసిన చంద్రబాబు !

ముఖ్యమంత్రి చంద్రబాబు తన జిల్లాల పర్యటనలో భాగంగా అనేక మంది వృత్తి కార్మికులను కలుస్తున్నారు. వారి జీవన విధానాన్ని దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు.

By:  Satya P   |   1 Jun 2026 11:22 PM IST
తాటి కల్లు టేస్ట్ చేసిన చంద్రబాబు !
X

ముఖ్యమంత్రి చంద్రబాబు తన జిల్లాల పర్యటనలో భాగంగా అనేక మంది వృత్తి కార్మికులను కలుస్తున్నారు. వారి జీవన విధానాన్ని దగ్గర ఉండి పరిశీలిస్తున్నారు. వారితో కలసి ముచ్చటిస్తున్నారు. వారి భుజం మీద చేయి వేసి మరీ పెద్దాయనగా భరోసా ఇస్తున్నారు. వారి ఇంటికి వెళ్తున్నారు. వారు పెట్టినది తిని వారితో గడిపి తాను ఉన్నాను అని అతి పెద్ద భరోసా ఇస్తున్నారు. ఒక విధంగా చంద్రబాబు ఈ తరహా పరామర్శలు పలకరింపు అన్నది ఏపీ రాజకీయాలలోనే కాదు దేశ రాజకీయాల్లోనే కొత్త ఆవిష్కరణగా అంతా చూస్తున్నారు.

పేదల సేవలో బాబు :

ఇదిలా ఉండగా కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం చామవరం గ్రామంలో తాజాగా చంద్రబాబు నిర్వహించిన పేదల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఇదే కార్యక్రమంలో భాగంగా కల్లు గీత కార్మికుడితో ముచ్చటించి అతన్ని ఆశ్చర్యప్రచారు. బబు ఏకంగా కల్లుగీత కార్మికుడు సింహాచలం ఇంటికి వెళ్ళి స్థానికంగా ఉన్న వారి అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అంతే కాదు ముఖ్యమంత్రి హోదాలో బాబ్వే స్వయంగా వచ్చి ఎన్టీఆర్ భరోసా పథకం లబ్ధిదారుడైన సింహాచలానికి నాలుగు వేల రూపాయలను అందించడం విశేషం. ఈ సందర్భంగా సింహాచలం కుటుంబంతో ఎంతో ఆప్యాయంగా ముచ్చటించారు.

కల్లు రుచి చూసిన బాబు :

అంతే కాదు కల్లు గీత కార్మికుడు సింహాచలం మనవడిని దగ్గరకు తీసారు, ఎంతో అభిమానంగా అప్యాయంగా బాబు ముద్దాడడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఇక బాబు సింహాచలం కుటుంబం గురించి అలాగే అతని ఆదాయం వారి వారి యోగక్షేమాలను అడిగి మరీ తెలుసుకున్నారు. అంతే కాదు కల్లుగీత వృత్తిలో ఉండే కష్ట నష్టాలను కూడా బాబు తెలుసుకోవడం జరిగింది. తన ఇంటికి వచ్చిన ముఖ్యమంత్రికి కల్లుగీత విధానాన్ని సింహాచలం ఎంతో వివరంగా చెప్పడం విశేషం. తాను ప్రస్తుతం ఆరు తాటి చెట్ల నుండి కల్లు గీస్తున్నానని సింహాచలం చెప్పుకొచ్చాడు. ఇక ఇదే సందర్భంలో మరో ముచ్చట జరిగింది సింహాచలం మేనల్లుడు ముసలయ్య తాటి చెట్టు ఎక్కి కల్లు తీశారు. ఈ కల్లు గీత విధానాన్ని చాలా ఆసక్తిగా చంద్రబాబు పరిశీలించారు. తాటి చెట్టుపై నుంచి ముసలయ్య తెచ్చిన తాజా కల్లును ముఖ్యమంత్రి రుచి చూడడం విశేషం.

మమేకం అవుతున్న తీరు :

ఇపుడు ఎన్నికలు లేవు, మరే హడావుడి లేదు, కానీ చంద్రబాబు తుచ తప్పకుండా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని పేదల ఇళ్ళను సందర్శిస్తున్నారు. అంతే కాదు వారి కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. వారిలో ఒకరిగా మారి బాధలను విని భరోసా ఇస్తున్నారు. ఇది మొత్తం పేదలందరికీ అతి పెద్ద ఊరటగా ఉంటోంది. రెండేళ్ల చంద్రబాబు పాలనలో ప్రతీ నెలా పెన్షన్ తానే స్వయంగా వెళ్ళి ఇవ్వడం కూడా ఒక రికార్డుగానే చూస్తున్నారు. మొత్తానికి బాబు పేదల సేవలో భాగంగా చేస్తున్న కార్యక్రమాలు తీసుకుంటున్న చర్యలు అయితే సంక్షేమ రాజ్యానికి అసలైన అర్ధాన్ని తెలియచేస్తున్నాయని చెప్పాల్సి ఉంది.