ఓర్నీ.. చీటింగ్ కూడా టెక్నాలజీతోనా? AI సహాయంతో పరీక్షలు, ఇంటర్వ్యూలు కూడా !
ప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో దానిని దుర్వినియోగం చేసే మార్గాలు కూడా అంతే పెరుగుతున్నాయి.
By: Tupaki Desk | 23 April 2025 9:58 AM ISTప్రస్తుత కాలంలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందుతుందో దానిని దుర్వినియోగం చేసే మార్గాలు కూడా అంతే పెరుగుతున్నాయి. తాజాగా 21 ఏళ్ల చుంగిన్ రాయ్ లీ అనే యంగ్ పారిశ్రామిక వేత్త తన స్టార్టప్ క్లూలీ ద్వారా సంచలనం సృష్టించారు. తన స్టార్టప్ అబ్‌స్ట్రాక్ట్ వెంచర్స్, సుసా వెంచర్స్ నుంచి 5.3మిలియన్ డాలర్ల సీడ్ ఫండింగ్ సంపాదించింది. ఇంతకీ అతడి స్టార్టప్ అయిన క్లూలీ అందిస్తున్నది ఏంటో తెలుసా.. పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూలు, సేల్స్ కాల్స్‌లో వినియోగదారులు మోసం చేయడానికి సాయపడే ఓ ఏఐ టూల్.
క్లూలీ ఒక సీక్రెట్ బ్రౌజర్ విండో ద్వారా పనిచేస్తుంది. ఇది ఇతరులకు కనిపించదు. ఇది AI సహాయంతో వినియోగదారులకు ఒక ఎక్స్ ట్రా బెనిఫిట్ అందిస్తుంది. రాయ్ లీ ఇంతకు ముందు కొలంబియా యూనివర్సిటీ నుంచి సస్పెండ్ అయ్యాడు. ఎందుకంటే అతను 'ఇంటర్వ్యూ కోడర్' అనే ఒక టూల్ క్రియేట్ చేశాడు. ఇది సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగ ఇంటర్వ్యూలలో మోసం చేయడానికి సాయపడుతుంది.
క్లూలీ టూల్ ఒకప్పుడు కాలిక్యులేటర్లు, స్పెల్‌చెక్ వంటి ఆవిష్కరణలతో పోలుస్తారు. అయితే, ఈ టూల్ తీవ్ర వివాదాలకు దారితీసింది. ముఖ్యంగా రాయ్ లీ ఒక డేట్‌లో తన వయస్సు, జ్ఞానం గురించి అబద్ధాలు చెప్పడానికి ఈ టూల్ ఉపయోగిస్తున్న వీడియో వైరల్ కావడంతో విమర్శలు వెల్లువెత్తాయి.
విమర్శలు ఉన్నప్పటికీ, లీ ఏఐ టూల్ మంచి ఆదరణ పొందుతోంది. క్లూలీ ఇప్పటికే 3 మిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని దాటింది. రాయ్ లీ, అతని సహ వ్యవస్థాపకుడు నీల్ షణ్ముగం ఈ స్టార్టప్‌పై దృష్టి పెట్టడానికి కొలంబియా యూనివర్సిటీ నుంచి మధ్యలోనే తప్పుకున్నారు.
