Begin typing your search above and press return to search.

ఢిల్లీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్!?

ఈ నేపథ్యంలో ఈ కేసు ఢిల్లీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులుగా మారుతున్నది.

By:  Tupaki Desk   |   4 May 2024 2:45 AM GMT
ఢిల్లీ పోలీస్ వర్సెస్ తెలంగాణ పోలీస్!?
X

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో వ్యవహారం రాజకీయ ప్రకంపనలు రేపుతున్నది.

ఈ కేసు విషయంలో ఢిల్లీలో హాజరు కావాలన్న ఆదేశాలను తనకు వీలుపడదని, ఎన్నికల బిజీలో ఉన్నందున నాలుగు వారాల సమయం కావాలని రేవంత్ రెడ్డి కోరాడు. అయినా ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తెలంగాణ సీఎంఓ, తన సొంత అకౌంట్ తప్ప మిగతా సోషల్ మీడియా అకౌంట్లతో తనకు సంబంధం లేదన్నది రేవంత్ రెడ్డి వాదన.

ఈ నేపథ్యంలో ఈ కేసు ఢిల్లీ పోలీసులు వర్సెస్ తెలంగాణ పోలీసులుగా మారుతున్నది. ఫేక్ వీడియో దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు విచారణకు హైదరాబాద్ వచ్చారు. అయితే తెలంగాణ బీజేపీ నేత ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు 469, 505 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జి మన్నె సతీశ్, సోషల్ మీడియా టీంలోని సభ్యులు అస్మా, తస్లీమా, గీత, శివలను అరెస్ట్ చేసి సెంట్రల్ క్రైం స్టేషన్‌కు తరలించారు.

టీపీసీసీ ట్విట్టర్ ఖాతా ఆధారంగా కేసు నమోదు చేసి సీసీఎస్ పోలీసులు నిందితులు గచ్చిబౌలి పోలీసులక అప్పగించారు. ఇదే కేసులో ఆరు సెక్షన్లతో ఢిల్లీ పోలీసులు కేసుపెట్టారు. రేవంత్ రెడ్డికి నోటీసులు జారీచేశారు. తాను తెలంగాణ కాంగ్రెస్ ఎక్స్ ఖాతాను నిర్వహించడం లేదని రేవంత్ సమాధానం ఇచ్చాడు.

ఈ కేసులో నిందితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ ఇబ్బందులు పడే అవకాశం ఉందని భావించి వారిని తెలంగాణ పోలీసులు వ్యూహాత్మకంగా ముందే అదుపులోకి తీసుకున్నారన్న వాదన వినిపిస్తున్నది. గాంధీ భవన్ కు వెళ్లిన ఢిల్లీ పోలీసులను ఎందుకు వచ్చారని బేగంబజార్ ఇన్స్ పెక్టర్ ప్రశ్నించగా లీగల్ సెల్ ఇంఛార్జ్ న్యాయవాది రామచంద్రారెడ్డితో మాట్లాడేందుకు వచ్చినట్లు చెప్పారని తెలుస్తున్నది. ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుంది ? ఢిల్లీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ? అన్నది వేచిచూడాలి.