Begin typing your search above and press return to search.

పండుగ వేళను మరింత బాగా ఎలానో చెప్పిన సిస్కో రిపోర్టు

ఏడాది చివరకు వచ్చేశాం. గతానికి భిన్నంగా ఇప్పటి పరిణామాలు ఉంటున్నాయి. పాతికేళ్ల క్రితం క్రిస్మస్ అన్నంతనే పెద్ద సందడి ఉండేది కాదు

By:  Tupaki Desk   |   17 Dec 2023 3:30 PM GMT
పండుగ వేళను మరింత బాగా ఎలానో చెప్పిన సిస్కో రిపోర్టు
X

ఏడాది చివరకు వచ్చేశాం. గతానికి భిన్నంగా ఇప్పటి పరిణామాలు ఉంటున్నాయి. పాతికేళ్ల క్రితం క్రిస్మస్ అన్నంతనే పెద్ద సందడి ఉండేది కాదు. పరిమితంగానే ఉండేది. ఇప్పుడు అందుకు భిన్నమైన వాతావరణం నెలకొంది. తెలుగునాట క్రిస్మస్ పండుగ.. మిగిలిన వారందరికి పండుగ వేళ్గగా మారింది. దీనికి కారణం.. గడిచిన పాతికేళ్లలో చోటు చేసుకున్న మార్పులే. ఐటీ సంబంధిత ఉద్యోగాల్లో ఎక్కువ మంది ఉండటం.. ఐటీ ఉద్యోగాలన్నీ కూడా అమెరికాతో పాటు.. ప్రాశ్చత్య దేశాలకు సంబంధాలు ఉండటం.. వారి సెలవుల ఆధారంగానే మన వారి కొలువులు ఉండటంతో.. వారి పండుగ వాతావరణం మనోళ్లలోనూ మూడ్ ఛేంజ్ చేస్తోంది.

పశ్చిమ దేశాలు క్రిస్మస్ ను ఎంత భారీగా చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పండుగ సందర్భంగా భారీగా వచ్చే సెలవులతో.. విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చే వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే.. విడి రోజులతో పోలిస్తే.. పండుగ రోజుల్లో మొబైల్ యాప్ ల వినియోగం భారీగా ఉంటుందన్న అంచనాను వేసింది సిస్కో.

ఇదే విషయాన్ని తాము సర్వే చేసిన వినియోగదారుల్లో 85 శాతం మంది ఒప్పుకున్నట్లుగా పేర్కొన్నట్లుగా తాజాగా విడుదలైన రిపోర్టు వెల్లడించింది. సినిమాలు.. ఆటలు... పాటలు.. ఇలా వినోదం ఏదైనా సరే.. మొబైల్ యాప్ లను వినియోగిస్తామన్న విషయాన్ని సర్వేలో పాల్గొన్న వారిలో 88శాతం మంది చెప్పినట్లుగా పేర్కొన్నారు. అమెరికా.. యూకే.. యూఏీ.. జర్మనీ.. భారత్ తో సహా వివిధ దేశాలకు చెందిన 12వేల మంది పాల్గొన్నట్లుగా రిపోర్టు వెల్లడించింది.

రిపోర్టులో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. అలెక్సా.. స్మార్ట్ హోం లాంటి కనెక్టడ్ పరికరాల్ని వాడే వీలు ఎక్కువన్న విషయాన్ని భారత్ నుంచి సర్వేలో పాల్గొన్న వారిలో 72 శాతం మంది చెప్పగా.. 60 శాతం మంది గేమింగ్ యాప్ ల వైపు మొగ్గు చూపటం గమనార్హం. సోషల్ మీడియా.. వీడియో కాల్స్.. ఫ్యామిలీ మెంబర్లతో మాట్లాడేందుకు..చాట్ చేసేందుకు యాప్ లను వాడుతున్నట్లుగా 84 శాతం మంది చెప్పారు. సెలవు రోజుల్లో ప్రత్యేకమైన వంటలకు అవసరమైన వస్తువుల్ని కొనేందుకు యాప్ లను వాడుతున్న విషయాన్ని 75 శాతం ఒప్పుకున్నట్లుగా పేర్కొన్నారు.

చెల్లింపులు.. నగదు బదిలీలకు సైతం పెద్ద ఎత్తున యాప్ ల వినియోగం జరుగుతున్నట్లుగా సర్వే రిపోర్టు స్పష్టం చేసింది. వార్తలు.. సమాచార ఆధారిత యాప్ లను వినియోగిస్తున్నట్లుగా 78 శాతం మంది చెప్పగా.. ఫుడ్ డెలివరీ సేవలను యాప్ ల ఆధారంగానే చేస్తామని 88 శాతం మంది వెల్లడించారు. ప్రభుత్వసేవలు పొందేందుకు యాప్ లను వాడుతున్నట్లగా 72 శాతం మంది చెప్పగా.. బ్రాడ్ బ్యాండ్.. వాటర్.. గ్యాస్.. కరెంట్ సంబంధిత సేవల్ని సైతం యాప్ లతోనే జరుపుతున్నట్లుగా నివేదిక వెల్లడించింది.