Begin typing your search above and press return to search.

గంజాయి వ్యాపారులతో సీఐ బర్త్ డే వేడుకలు.. హైదరాబాద్ లో సంచలనం!

పాతబస్తీ పరిధిలోని మంగళ్ హాట్ పోలీసు స్టేషన్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ మహేందర్ రెడ్డి చేసిన పని ఇప్పుడు షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   25 April 2024 5:22 AM GMT
గంజాయి వ్యాపారులతో సీఐ బర్త్ డే వేడుకలు.. హైదరాబాద్ లో సంచలనం!
X

షాకింగ్ ఉదంతం బయటకు వచ్చింది. హైదరాబాద్ మహానగరంలోని ఒక సీఐ చేసిన పనికి పోలీసు ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకోవటమే కాదు.. ఔరా.. మరీ ఇంత బరితెగింపా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రౌడీలు.. అక్రమ పద్దతిలో దందాలు నడిపేటోళ్లు.. జూదరులు.. గంజాయి వ్యాపారుతో కలిసి ఒక సీఐ (డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్) తన పుట్టిన రోజు వేడుకల్ని జరుపుకోవటం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు వైరల్ కావటం గమనార్హం.

పాతబస్తీ పరిధిలోని మంగళ్ హాట్ పోలీసు స్టేషన్ డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ చేసిన పని ఇప్పుడు షాకింగ్ గా మారింది. కొందరు గంజాయి వ్యాపారులు.. జూదం ఆడేటోళ్లతో కలిసి ఒక పేకాట క్లబ్ (అనధికారికంగా నిర్వహిస్తున్నారు)లో పోలీసు అధికారి తన పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించుకున్నారు.

దీనికి సంబంధించిన ఫోటోలు.. వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో.. హైదరాబాద్ మహానగర పోలీసు కమిషనర్ శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. తానో బాధ్యత కలిగిన పోలీసు అధికారి అన్న విషయాన్ని మర్చిపోయి.. బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిన తీరుతో.. సదరు అధికారిని సీపీ కార్యాలయానికి పిలిపించి.. అతడి చేతిలో సస్పెన్షన్ ఆర్డర్ పెట్టినట్లుగా తెలుస్తోంది. సంఘ విద్రోకశక్తులతో చట్టాపట్టాలేసుకున్న తీరుకు గట్టి చర్యలు తీసుకోకుంటే.. క్రమశిక్షణ పూర్తిగా పోతుందన్న విషయాన్ని మరవొద్దు.