Begin typing your search above and press return to search.

తండ్రికి తగ్గ తనయుడు.. తాడోబా అడవుల్లో చోటా మట్కా ప్రత్యేకత ఇదే !

చోటా మట్కా తన రాజ్యాన్ని నవేగావ్ కోర్ బఫర్ వరకు విస్తరించుకున్నాడు.చోటా మట్కా 2016లో తాడోబా కోర్ ఏరియాలో జన్మించాడు.ఇటీవల

By:  Tupaki Desk   |   15 May 2025 5:00 AM IST
తండ్రికి తగ్గ తనయుడు.. తాడోబా అడవుల్లో చోటా మట్కా ప్రత్యేకత ఇదే !
X

మహారాష్ట్రలోని తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్ (TATR)లో చోటా మట్కా అలియాస్ T126 అనేది ఓ మగ పులి. తడోబా అడవుల్లో తిరిగిన లెజెండరీ పులులైన చోటి తారా, మట్కాసుర్ సంతానమే ఈ చోటా మట్కా. చోటా మట్కా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఆధిపత్యాన్ని సంపాదించుకున్నాడు. అంతేకాదు బజరంగ్, మౌగ్లీ, బాంబూవాలా మగ పులి వంటి ఇతర బలమైన మగ పులులతో కూడా తన ప్రాంతం కోసం పోరాడాడు.

చోటా మట్కా తాడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో బలమైన మగ పులిగా గుర్తింపు పొందాడు. తన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఇతర పులులతో తీవ్రంగా పోరాడాడు. బజరంగ్‌తో జరిగిన పోరాటంలో బజరంగ్ మరణించాడు. తన ఆధిపత్యాన్ని నిలుపుకున్నప్పటికీ చోటా మట్కా ప్రాంతీయ పోరాటాల్లో గాయాలపాలయ్యాడు. ఇటీవలి పోరాటం తర్వాత నడుస్తున్నప్పుడు కుంటుతూ కనిపించాడు. చోటా మట్కా తడోబా అడవుల్లో పేరుగాంచిన పులులైన చోటి తారా, మట్కాసుర్ వారసుడు.

చోటా మట్కా తన రాజ్యాన్ని నవేగావ్ కోర్ బఫర్ వరకు విస్తరించుకున్నాడు.చోటా మట్కా 2016లో తాడోబా కోర్ ఏరియాలో జన్మించాడు.ఇటీవల వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం.. చోటా మట్కా తన ప్రాంతాన్ని కాపాడుకోవడానికి బ్రహ్మ అనే మరో మగ పులితో పోరాడాడు. ఈ పోరాటంలో బ్రహ్మ మరణించగా, చోటా మట్కా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. చోటా మట్కా గతంలో కూడా బజరంగ్, మౌగ్లీ అనే రెండు పులులను చంపి తన ఆధిపత్యాన్ని నిరూపించుకున్నాడు.

స్థానిక ప్రజలు చోటా మట్కాను 'చిన్న మట్కాసుర్' అని కూడా పిలుస్తారు. తన తండ్రి మట్కాసుర్ వలెనే ఈ పులి కూడా చాలా ధైర్యంగా ఉంటుందని, పర్యాటకులకు తరచుగా కనిపిస్తూ ఉంటుందని చెబుతారు. చోటా మట్కా తన రాజ్యంలో మూడు ఆడ పులులతో కలిసి తిరుగుతూ పిల్లలను కూడా కనినట్టు తెలుస్తోంది. మగ పులులు సాధారణంగా తమ పిల్లల బాగోగులు చూడకపోయినా, చోటా మట్కా మాత్రం తన పిల్లలతో ఆహారాన్ని పంచుకోవడం విశేషం.

చోటా మట్కా కేవలం ఒక పులి మాత్రమే కాదు, తాడోబా అడవుల శక్తికి, వన్యప్రాణుల పోరాట పటిమకు ఒక ప్రతీక. తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈ 'చిన్న మట్కా' త్వరలోనే తాడోబా అడవులకు తిరుగులేని రాజుగా మారతాడని అంటున్నారు.