Begin typing your search above and press return to search.

తమిళ క్రిటిక్స్‌పై చిరు ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్!

అలాగే రెండు భాషలకు చెందిన ఫ్యాన్స్ మధ్య కూడా తరచుగా వార్స్ జరుగుతుంటాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2024 1:45 PM GMT
తమిళ క్రిటిక్స్‌పై చిరు ఫ్యాన్స్ రివర్స్ ఎటాక్!
X

సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ ఏ స్థాయిలో ఉంటాయో తెలిసిందే. ఒకే కుటుంబానికి చెందిన హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా తీవ్ర స్థాయిలో ఘర్షణలు జరుగుతుంటాయి. అలాగే రెండు భాషలకు చెందిన ఫ్యాన్స్ మధ్య కూడా తరచుగా వార్స్ జరుగుతుంటాయి. ఇండియాలో బెస్ట్ డ్యాన్సింగ్ స్టార్స్ టాలీవుడ్ హీరోలే అనేది నిర్వివాదాంశం అయినప్పటికీ అప్పుడప్పుడూ విజయ్, శింబు లాంటి తమిళ స్టార్స్‌ను మించిన డ్యాన్సర్లు లేరంటూ అక్కడి ఫ్యాన్స్ మన వాళ్లతో తగువులాడుతుంటారు.

ఇటీవలే శింబు ముందు అల్లు అర్జున్ డ్యాన్సుల్లో ఎందుకు పనికిరాడంటూ ఒక సిల్లీ గొడవను మొదలుపెట్టారు తమిళ ఫ్యాన్స్. ఐతే మన వాళ్లు ఇద్దరి డ్యాన్స్ వీడియోలను పక్కపక్కన పెట్టి వాళ్లకు దీటైన బదులిచ్చారు. ఆ సంగతలా ఉంచితే ఇప్పుడు చిరు ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. గత ఏడాది ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా చిరంజీవి మీద కించపరిచేలా పోస్టులు పెట్టిన తమిళ క్రిటిక్స్, ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు మెగా ఫ్యాన్స్.

2023 ఇండిపెండెన్స్ వీకెండ్లో చిరు సినిమా ‘భోళా శంకర్‌’కు పోటీగా.. రజినీ చిత్రం ‘జైలర్’ రిలీజైంది. ఐతే భోళా శంకర్ డిజాస్టర్ కాగా.. జైలర్ తమిళంతో పాటు తెలుగులోనూ బ్లాక్ బస్టర్ అయింది. అది చూపించి రజినీ ముందు చిరు వేస్ట్ అన్నట్లుగా తమిళ క్రిటిక్స్, ఫ్యాన్స్ పోస్టులు పెట్టారు. వీకెండ్ తర్వాత భోళా శంకర్‌కు ప్రతి రోజూ జీరో షేర్ వచ్చిందంటూ వెటకారాలు ఆడారు.

అలాగే కీర్తి సురేష్‌తో స్టేజ్ మీద చిరు సరదాగా ఉన్న వీడియోలు పెట్టి.. చిరు అరాచకాలు అంటూ అదే పనిగా టార్గెట్ చేశారు కూడా. ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు చిరు ఫ్యాన్స్ రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. రజినీ కొత్త సినిమా ‘లాల్ సలాం’ తెలుగులో పెద్ద డిజాస్టర్ అయింది. షేర్ దాదాపుగా జీరో అనే చెప్పాలి. దీంతో నాడు చిరు మీద పెట్టిన పోస్టులను ట్యాగ్ చేస్తూ.. డే-1 నుంచే జీరో షేర్ రాబట్టిన చిత్రం అంటూ ‘లాల్ సలాం’ను కోట్ చేస్తున్నారు. తమిళంలో కూాడా ఈ సినిమా డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తుండడంతో ఆ కలెక్షన్లను కూడా పోస్ట్ చేస్తూ తమిళ క్రిటిక్స్, ఫ్యాన్స్‌కు కౌంటర్ ఇస్తున్నారు మెగా అభిమానులు.