Begin typing your search above and press return to search.

చిరు మనసు దోచుకున్న పార్టీ అదేనా...!?

అలా తన జీవితాశయాన్ని పెట్టుకున్న చిరు మనసుని దోచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చిన బీజేపీ ఎట్టకేలకు అందులో సక్సెస్ అయిందా అంటే ప్రచారం మాత్రం ఆ రేంజిలో సాగుతోంది.

By:  Tupaki Desk   |   30 Jan 2024 3:30 AM GMT
చిరు మనసు దోచుకున్న పార్టీ అదేనా...!?
X

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలు అంటే విసిగిపోయారు. ఒక్కమాటలో చెప్పాలీ అంటే ఆయన ఈ వైపుగా అసలు తొంగి చూడడంలేదు. వంగి వాలడంలేదు. ఎంచక్కా తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన కోరిక ఏంటి అంటే ఇంకా ఎక్కువగా సినిమాలు చేయాలని ఓపిక ఉన్నంతవరకూ అసలు రిటైర్మెంట్ ఊసే ఎత్తకుండా షూటింగులు చేయాలని.

అలా తన జీవితాశయాన్ని పెట్టుకున్న చిరు మనసుని దోచుకునే ప్రయత్నం చేస్తూ వచ్చిన బీజేపీ ఎట్టకేలకు అందులో సక్సెస్ అయిందా అంటే ప్రచారం మాత్రం ఆ రేంజిలో సాగుతోంది. చిరంజీవిని రాజకీయాల్లో సుముఖుడిని చేయడంలో కాషాయం పార్టీ విజయవంతం అయింది అని అంటున్నారు.

విముఖుడిని సుముఖుడిగా చేయడం శకుని నీతి. బీజేపీ కూడా అలా చేసిందా అంటే కొద్ది రోజులు ఆగితే వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు. చిరంజీవికి దేశంలో అతి పెద్ద రెండవ పౌర పురస్కారం పద్మ విభూషణ్ ఇచ్చిన కేంద్రాన్ని ఏలే బీజేపీ ఇపుడు మరో భారీ గిఫ్ట్ రెడీ చేసి ఉంచింది. అదే రాజ్యసభ సీటు.

మొదట రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో పదవి అని అనుకున్నారు. అదైతే రాజకీయాలకు అతీతంగా ఉండే పదవి. కానీ చిరు మీద తమ పార్టీ ముద్ర ఉండాలని ఆయన్ని బీజేపీ వారుగా చేసుకోవాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ ఇపుడు ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభ సీటుకు చిరంజీవి పేరుని సీరియస్ గా పరిశీలిస్తోంది అని అంటున్నారు.

అది కూడా తమకు బోలెడు సీట్లు ఉన్న యూపీ నుంచి చిరంజీవిని రాజ్యసభకు పంపించాలని చూస్తున్నారు అని అంటున్నారు. అక్కడ నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగు వారు జీవీఎల్ నరసింహారావు పదవీ విరమణ చేస్తున్నారు. ఆ ఖాళీలో చిరంజీవిని అకామిడేట్ చేయడం ద్వారా తెలుగు కోటాను అలాగే భర్తీ చేయవచ్చు అని చూస్తున్నారుట.

అంతే కాదు మెగాస్టార్ వంటి వారు తమ ఎంపీ అయితే బీజేపీకి అద్భుతమే అని అంటున్నారు. చిరంజీవి సేవలను రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో విరివిగా వాడుకోవాలని చూస్తున్నారు అని అంటున్నారు. ఆయన అండగా ఉంటే చాలు రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని కూడా విశ్వసిస్తోంది.

నిజానికి చిరంజీవి అందరివారు. అయినా సరే సంకుల సమరంగా ఉన్న ఏపీలో ఆయన ప్రభావం ఒక బలమైన సామాజిక వర్గం మీద పడి అక్కడ కూడా కమలం పార్టీ జాక్ పాట్ కొట్టవచ్చు అని భావిస్తున్నారు. ఇక హ్యాట్రిక్ కొట్టి ముచ్చటగా మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఈసారి కేంద్రంలో కీలకమైన మంత్రిత్వ శాఖను కూడా చిరంజీవిని ఇవ్వాలని కూడా బీజేపీ పెద్దలు డిసైడ్ అయ్యారని అంటున్నారు.

మొత్తానికి ప్రచారం అయితే ఒక రేంజిలో సాగుతోంది. చిరంజీవి ఓకే అన్నారా లేదా అన్నది ఆయన ఏదైనా ప్రకటిస్తేనే కానీ తెలియదు. కొద్ది రోజులలో రాజ్య సభ ఎన్నికలు ఉన్న వేళ ఈ విషయం బయటపడకా మానదు.