Begin typing your search above and press return to search.

విశ్వంభర కోసం చిరు 'జైలర్‌' తరహా...!

రజనీకాంత్ జైలర్ సినిమాలో ఓల్డ్ గెటప్ లో ఎలా అయితే విభిన్నంగా స్టైలిష్ గా కనిపించాడో అలాగే విశ్వంభర సినిమాలో చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాల

By:  Tupaki Desk   |   6 Feb 2024 5:55 AM GMT
విశ్వంభర కోసం చిరు జైలర్‌ తరహా...!
X

మెగాస్టార్ చిరంజీవి గత చిత్రాల ఫలితం నేపథ్యంలో చాలా గ్యాప్ తీసుకుని ఎట్టకేలకు విశ్వంభర సినిమాలో నటించేందుకు రెడీ అయ్యాడు. బింబిసార వంటి విభిన్నమైన సోషియో ఫాంటసీ సినిమాను రూపొందించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్ లో మెగాస్టార్ చిరంజీవితో పాటు త్రిష జాయిన్‌ అయ్యింది. ఈ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలు మరింతగా పెంచుతూ సినిమా గురించి ఏదో ఒక పుకారు సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా వైరల్‌ అవుతూనే ఉంది.

ఈసారి చిరంజీవి లుక్ గురించి ఆసక్తికర ప్రచారం ఒకటి జరుగుతోంది. సినిమాలో వచ్చే ప్లాష్ బ్యాక్‌ ఎపిసోడ్స్ లో చిరంజీవి లుక్‌ రగ్గుడ్‌ గా ఉంటుందని, ఆయన వయసుకు తగ్గట్లుగా మేకోవర్‌ తో కనిపించబోతున్నట్లు సమాచారం అందుతోంది.

రజనీకాంత్ జైలర్ సినిమాలో ఓల్డ్ గెటప్ లో ఎలా అయితే విభిన్నంగా స్టైలిష్ గా కనిపించాడో అలాగే విశ్వంభర సినిమాలో చిరంజీవి కూడా కొన్ని సన్నివేశాల వరకు ఏడు పదుల వయసు వ్యక్తిగా కనిపించబోతున్నాడు అంటూ యూనిట్ సభ్యుల నుంచి అనధికారిక సమాచారం అందుతోంది.

కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. చిరంజీవి చాలా ఏళ్ల తర్వాత నటిస్తున్న సోషియో ఫాంటసీ సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.