బీజేపీలోకి మెగాస్టార్... కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు
మెగాస్టార్ గా తెలుగు నాట దశాబ్దాలుగా వెలుగుతున్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి వచ్చారు.
By: Tupaki Desk | 16 Jun 2025 3:54 AMమెగాస్టార్ గా తెలుగు నాట దశాబ్దాలుగా వెలుగుతున్న చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళి వచ్చారు. అక్కడ ఇమడలేకనే ఆయన తప్పుకున్నారు అని అంతా అంటారు. చిరంజీవి కూడా సినీ రంగంలోనే తనకు బాగుందని చెబుతూ ఉంటారు. ఆయన తన జీవిత కాలంలో సినిమాలే తప్ప మళ్లీ రాజకీయాల వైపు తొంగి చూడరు అని అంటారు.
అయితే చిరంజీవి చుట్టూ రాజకీయాలు మాత్రం అలా తిరుగుతూనే ఉంటున్నాయి. ఆయన బీజేపీలో చేరుతారు అన్నది ఎప్పటి నుంచో ఉన్న ఒక పుకారు లాంటి ప్రచారం అయితే దానిని చాలా గట్టిగా గాసిప్ కంటే ఎక్కువగా రాసుకునేంత వీలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవిని పిలిస్తే బీజేపీలో చేరుతారు అని కిషన్ రెడ్డి తాజాగా కామెంట్స్ చేశారు. బీజేపీకి ఎంతో మంది సినీ ప్రముఖులతో మంచి సంబంధాలు ఉన్నాయని ఆయన అంటూ తనకు చిరంజీవి మంచి మిత్రుడిగా చెప్పుకున్నారు. చిరంజీవిని ఆహ్వానిస్తే కనుక బీజేపీలో చేరుతారని తన పుట్టిన రోజు వేళ మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ సెన్షేషనల్ కామెంట్స్ చేశారు.
ఎంతో మంది సినీ ప్రముఖులు బీజేపీకి ఎన్నో విధాలుగా సాయపడుతూ ఉంటారని చెప్పారు. అంతే కాదు ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు అని ఆయన గుర్తు చేశారు. మరో వైపు చూస్తే చిరంజీవి ఈ మధ్య కాలమంతా బీజేపీ పెద్దలతో కనిపిస్తూ ఉన్నారు. ఆయన ఈ ఏడాది ఢిల్లీలో కిషన్ రెడ్డి ఇంట్లో జరిగిన సంక్రాంతి వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పాల్గొన్నారు.
దాంతో ఆ సమయంలో దాని మీద ఎంతో చర్చ సాగింది. చిరంజీవి బీజేపీలో చేరడం ఒక్కటే తరువాయి అని కూడా అంతా ప్రచారం చేశారు. అయితే చిరంజీవి అయితే రాజకీయాలకు దూరం అన్న తన స్టాండ్ ని మాత్రం అలాగే కొనసాగిస్తున్నారు. ఆయన దానికే కట్టుబడి ఉన్నారు.
ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పినది కూడా నిజం. ఆయనకు చిరంజీవితో మంచి రిలేషన్స్ ఉన్నాయ్హి. అయితే అవి స్నేహం వరకే పరిమితం అని అంటున్నారు. ఒకవేళ బీజేపీ పెద్దలు ఆహ్వానించినా కూడా చిరంజీవి బీజేపీలో చేరకుండా సున్నితంగా తిరస్కరిస్తారు అని అంటున్నారు.
అయితే కేంద్ర మంత్రి మాత్రం ధీమాగ్ బిజెపి ఆహ్వానిస్తే చిరంజీవి పార్టీలోకి వస్తారంటూ చెప్పడం మీద చర్చ సాగుతోంది. అంతే కాదు కమలం కండువా వేస్తామంటే చాలా మంది చేరేందుకు రెడీ అని కూడా అంటున్నారు. ఇక చిరంజీవి మీద చూస్తే కిషన్ రెడ్డికి చాలా ధీమా ఉంది అని అంటున్నారు. తన మాట మెగాస్టార్ కాదనరని పిలవగానే బీజేపీలోకి వచ్చి చేరుతారు అని అనడం మీదనే చర్చ సాగుతోంది.
మరో వైపు చూస్తే ఎంతో మంది సినీ ప్రముఖులు బీజేపీలో చేరి మంత్రులు అయ్యారని కిషన్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. మరి చిరంజీవికి ఏమైనా కేంద్ర మంత్రి ఆఫర్ ఉందా అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.