'కొండయ్య' విశ్వరూపం.. వైసీపీకి తెలిసొచ్చిందా ..!
ఆయన గత ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడే.. ఏముంది.. ఇట్టే గెలిచేస్తాం.. అని వైసీపీ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే కరణం బలరాం చెప్పుకొచ్చారు
By: Tupaki Desk | 16 May 2025 10:54 AM ISTచీరాల టీడీపీ ఎమ్మెల్యే కొండయ్యను వైసీపీ లైట్ తీసుకుంది. ఇది పక్కా వాస్తవం. ఆయన గత ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడే.. ఏముంది.. ఇట్టే గెలిచేస్తాం.. అని వైసీపీ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే కరణం బలరాం చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈయన కూడా.. గతంలో టీడీపీ నాయకుడే. అయితే.. కొండయ్యను లైట్ తీసుకున్న ఆయనకు తాజాగా.. ఇప్పుడు వాస్తవం తెలిసి వచ్చింది. చీరాల మునిసిపాలిటీని కొండయ్య ఘన విజయంగా టీడీపీ ఖాతాలో వేసి.. తనకుతానే సాటి అనిపించుకున్నారు.
చీరాల మునిసిపల్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న జంజనం శ్రీనివాసరావును ఆదిలోనే మచ్చిక చేసుకునేందుకు కొండయ్య ప్రయత్నించారు. నీ సీటు నీకు ఉండాలంటే.. నేను చెప్పింది వినమని బుజ్జగించారు. అయితే.. జంజనం మాత్రం ససేమిరా అన్నారు. అయితే.. అప్పట్లో ఆయనకు కరణం బలారం అండగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. కానీ, రోజులు వారాలు గడిచేసరికి మాత్రం కరణం యూటర్న్ తీసుకు న్నారు. తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించారు.
దీంతో కొండయ్యకు మరింత గా కలిసి వచ్చింది. జంజనం శ్రీనివాసరావును దారిలోకి తెచ్చుకోలేక పోయా మన్న చింతను పక్కను పెట్టి.. ఆయన వ్యూహాత్మకంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గాన్ని అక్కున చేర్చు కున్నారు. ఈ క్రమంలో కొద్దిపాటి రాజకీయ వ్యూహాత్మక ఎత్తుగడల దిశగా వైసీపీ అడుగులు వేసినా.. అవి ఏమాత్రం ఫలించలేదు. దీనికి తోడు ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్‌ను కూడా కలుపుకొని ముందుకు సాగడం కొండయ్య రాజకీయ చాతుర్యానికి మచ్చుతునకగా మారింది.
ఎంపీ వ్యూహాలు.. ఎమ్మెల్యే ఎత్తుగడలతో వైసీపి నుంచి చీరాల మునిసిపాలిటీ టీడీపీకి దక్కేలా చేసింది. అంతేకాదు.. కొండయ్య ఏం చేస్తాడులే.. అని లైట్ తీసుకున్న వైసీఈ నాయకులకు దిమ్మతిరిగేలా ఆయ న వ్యవహారించారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. రేపు కొత్త చైర్మన్ ఎంపిక లోనూ సీఎం చంద్రబాబు ఎమ్మెల్యే కొండయ్యకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. దీంతో ఆయన కనుసన్నల్లోనే ఎంపిక పూర్తికానుంది. దీంతో కొండయ్య పేరు ఇప్పుడు చీరాలలో మార్మోగుతోంది.
