Begin typing your search above and press return to search.

బిహార్ లో మరోబాబాయ్ అబ్బాయ్.. చీల్చి కలుపుతున్న బీజేపీ

కాగా రాంవిలాస్ ప్రాతినిధ్యం వహించిన హాజీపూర్ సీటుపై పశుపతి-చిరాగ్ ఇద్దరూ కన్నేశారు

By:  Tupaki Desk   |   17 July 2023 10:24 AM GMT
బిహార్ లో మరోబాబాయ్ అబ్బాయ్.. చీల్చి కలుపుతున్న బీజేపీ
X

మహారాష్ట్రలో రెండు వారాల కిందట ఏం జరిగిందో అందరూ చూశారు. అప్పటివరకు బాబాయ్ శరద్ పవార్ ను వెన్నంటి ఉన్న అజిత్ పవార్ ఉన్నట్లుండి ప్లేటు ఫిరాయించారు. ఆయనతో పాటు మరో 8 మంది బీజేపీ-శివసేన (శిందే) ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణం చేశారు. పైకి చెప్పుకున్నా.. ఇది బీజేపీ ఆడించిన నాటకమే. రెండేళ్ల కిందట బిహార్ లోనూ ఇలానే చేసింది ఆ పార్టీ. అయితే, నాడు ఏ పార్టీనైతే చీల్చిందో అదే పార్టీని మళ్లీ కలుపుతోంది కమలం.

బిహార్ లోనే కాక దేశంలోనే దళిత రాజకీయ దిగ్గజాల్లో రామ్ విలాస్ పాశ్వాన్ ఒకరు. లోక్ జనశక్తి పేరిట సొంతంగా పార్టీ నెలకొల్పి మరీ ఉనికి చాటుకున్నారు ఆయన. రెండేళ్ల కిందట చనిపోయారు. ఆ తర్వాత పాశ్వాన్ కుమారుడు చిరాగ్ బీజేపీతో కాస్త విభేదించారు.

అంతే.. లోక్ జనశక్తిని బీజేపీ చీల్చేసింది. పాశవాన్ సోదరుడు పశుపతినాథ్ పాశవాన్ ను దగ్గరకు తీసింది. ఐదుగురు ఎంపీల బలం ఉన్న ఆయనకు ఏకంగా కేంద్ర మంత్రి పదవి కూడా ఇచ్చింది.

అన్నట్లు లోక్ జనశక్తి పార్టీ 2019లో ఆరు లోక్ సభ స్థానాలు గెలిచింది. వీరిలో చిరాగ్ ఒకరు. అయితే, రాం విలాస్ మరణానంతరం చీలిక తెచ్చిన బీజేపీ.. పశుపతి చేత పశుపతి రాష్ట్రీయ లోక్ జనశక్తి పేరిట కొత్త పార్టీని ప్రారంభింపజేసింది.

నేడు మళ్లీ చేతులు కలిపిస్తోంది పశుపతి వెళ్లిపోవడంతో చిరాగ్ ఆధర్యంలోని లోక్ జనశక్తి పేరుకే అన్నట్లయింది. అయేత, రాంవిలాస్ కుమారుడిగా చిరాగ్ ప్రాధాన్యం తీసిపారేయలేనిది. అందులోనూ బిహార్ లో నీతీశ్ కుమార్ సారథ్యంలోని జేడీయూ-ఎల్జేడీ-కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢీ కొట్టాలంటే బీజేపీ అక్కడ బలపడాలి. దళిత ఓట్లు వీరిద్దరి మధ్య చీలిపోతే ప్రమాదమని భావించి మళ్లీ చిరాగ్-పశుపతిలను కలుపుతోంది. ఈ మేరకు కేంద్ర మంతి నిత్యానందరాయ్ రెండు వర్గాలతోనూ చర్చలు జరిపారు.

పశుపతి మాత్రం కాస్త బెట్టుచేస్తున్నట్లుగా తెలుస్తోంది. చిరాగ్ ను ఏకంగా మంగళవారం నాటి ఎన్డీఏ సమావేశానికీ ఆహ్వానించింది. కాగా రాంవిలాస్ ప్రాతినిధ్యం వహించిన హాజీపూర్ సీటుపై పశుపతి-చిరాగ్ ఇద్దరూ కన్నేశారు. ఇప్పుడు ఇక్కడినుంచి పశుపతి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చిరాగ్ జామై నుంచి ఎంపీగా గెలిచారు.

6 లోక్ సభ, ఒక రాజ్యసభ సీటు కావాలి ఇక చిరాగ్ ఎన్డీయేలోకి వచ్చేందుకు పలు షరతులు పెడుతున్నారు. ఆయనతో పాటు లోక్ జనశక్తి 2019లో గెలిచిన ఆరు లోక్ సభ సీట్లూ ఇవ్వాలని.. తండ్రి మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాన్నీ కేటాయించాలని కోరుతున్నారు.