Begin typing your search above and press return to search.

మ‌హానాడు రుచుల్లో చింత‌మ‌నేని స్పెష‌ల్స్ ..!

ఇంక‌, మరో స్పెష‌ట్‌.. ఆవ‌కాయ‌. వేస‌వి కాలం అన‌గానే ఆంధ్రుల‌కు ఆవ‌కాయ ప్ర‌త్యేకం. దీనిని మ‌హానాడు లో చింత‌మ‌నేని వ‌డ్డించ‌నున్నారు.

By:  Tupaki Desk   |   28 May 2025 9:28 PM IST
మ‌హానాడు రుచుల్లో చింత‌మ‌నేని స్పెష‌ల్స్ ..!
X

చింతమ‌నేని ప్ర‌భాక‌ర్‌. చేతికి కూడా ఎముక‌లేని నాయ‌కుడిగా పేరు తెచ్చుకుంటున్నారు. పండుగ ఏదైనా ఆయ‌న పేరు మార్మోగాల్సిందే.. అన్న‌ట్టుగా గ‌త ఆరుమాసాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క్రిస్టియ‌న్ పండుగ వ‌చ్చినా ముస్లింల రంజాన్ వ‌చ్చినా.. తెలుగు వారి శ్రీరామ న‌వ‌మి వ‌చ్చినా.. ఆయ‌న ముందుంటున్నారు. త‌న‌దైన శైలిలో పంప‌కాలు చేస్తున్నారు. రంజాన్ సంద‌ర్బంగా మైనారిటీ సోద‌రుల కుటుంబాల‌కు కిలో చొప్పున మ‌ట‌న్ పంచారు. న‌వ‌మి వేడుక‌ల సంద‌ర్భంగా ఇంటికి కిలో బెల్లం పంపిణీ చేశారు.

ఇక‌, ఇప్పుడు టీడీపీ ప‌సుపు పండుగ‌ మ‌హానాడును పుర‌స్క‌రించుకుని కూడా.. చింత‌మ‌నేని త‌న‌దైన శైలి లో రుచులు చూపించారు. ప్ర‌త్యేకంగా త‌న నియోజ‌క‌వ‌ర్గం దెందులూరు నుంచి పాక‌శాస్త్ర నిపుణులను క‌డ‌ప‌కు తీసుకువెళ్లి.. ప్ర‌త్యేక వంట‌కాలు చేయిస్తున్నారు. మూడు రోజుల పాటు కూడా.. ఆయ‌న మ‌హానా డుకు వ‌చ్చే అతిధుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ప్ర‌త్యేక రుచుల‌తో కూడిన వంట‌కాల‌ను శ్ర‌ద్ధ‌గా త‌యారు చేయిస్తు న్నారు.

వీటిలో వెజ్‌, నాన్ వెజ్‌వంట‌కాల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మ‌హానాడులో గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి నాన్‌వెజ్‌వంట‌కాలు పెడుతున్నారు. దీనికి చింత‌మ‌నేని సార‌థ్యం వ‌హిస్తున్నారు. చికెన్‌, మ‌ట‌న్‌తో కూడిన ప్ర‌త్యేక వంట‌కాలు చేయిస్తున్నారు. దోస‌కాయ మ‌ట‌న్ కూర‌ను ప్ర‌త్యేకంగా వ‌డ్డిస్తున్నా రు. అదేవిధంగా బిర్యానీ కామ‌లం(కొత్త త‌ర‌హా వంట‌కం), ఆంధ్రా చికెన్‌, బ‌గారా రైస్ వంటివి వండిస్తున్నా రు. దీనికి అయ్యే సొమ్ములు ఆయ‌నే ఖ‌ర్చు చేస్తున్న‌ట్టు స్వ‌యంగా చెప్పుకొచ్చారు.

ఇంక‌, మరో స్పెష‌ట్‌.. ఆవ‌కాయ‌. వేస‌వి కాలం అన‌గానే ఆంధ్రుల‌కు ఆవ‌కాయ ప్ర‌త్యేకం. దీనిని మ‌హానాడు లో చింత‌మ‌నేని వ‌డ్డించ‌నున్నారు. దాదాపు 1300 మామికాయ‌ల‌ను ప్ర‌త్యేక వాహ‌నాల్లో మ‌హానాడుకు తీసు కువ‌చ్చి.. అక్క‌డే వాటిని ముక్క‌లుగా కొట్టించి..కారం, ఉప్పు, ఆవ‌పిండి, నూనెల‌ను క‌లిపి.. అప్ప‌టిక‌ప్పు డు ఘాటు ఘాటుగా ఆవ‌కాయ‌ను వ‌డ్డిస్తున్నారు. ఇది మూడు రోజుల పాటు స‌రిపోయేలా త‌యారు చేయించారు. `గ‌త‌ప్ర‌భుత్వ అరాచ‌కాల‌కు.. ఆవ‌కాయ‌తో స‌మాధానం` అంటూ.. ఆయ‌న వ్యాఖ్యానిం చ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి చింత‌మ‌నేని త‌న‌దైన స్ట‌యిల్‌ను మ‌హానాడులోనూ కొన‌సాగిస్తున్నారు.