Begin typing your search above and press return to search.

చైనాలో దేశభక్తిని పెంపెందించే కొత్త చట్టం... పొందుపరిచిన అంశాలివే!

ఇది దేశభక్తిని పెంపొందించడానికి రూపొందించబడినప్పటికీ.. చట్టం హేతుబద్ధంగా, అందరినీ కలుపుకొనిపోతూ.. ఓపెన్ మైండెడ్‌ గా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుందని.. ఇతర నాగరికతలను స్వీకరించడం అనే విషయాన్ని గుర్తుచేస్తుందని జిన్హువా వెల్లడించింది.

By:  Tupaki Desk   |   25 Oct 2023 10:08 AM GMT
చైనాలో దేశభక్తిని పెంపెందించే  కొత్త చట్టం... పొందుపరిచిన అంశాలివే!
X

చైనాలో సరికొత్త విద్యావిధానానికి శ్రీకారం చుట్టింది. అందుకోసం అక్కడి ప్రభుత్వం సరికొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అదే... పేట్రియాటిక్ ఎడ్యుకేషన్ లా! ఇప్పుడు ఈ చట్టం చర్చనీయాంశం అయ్యింది. వచ్చే ఏడాది 2024 నుంచి ఈ చట్టం అమలులోకి రాబోతుందని చైనా మీడియా వెల్లడించింది.

అవును... చైనా జాతీయ శాసనసభ అయిన నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ సెషన్‌ లో పేట్రియాటిక్ ఎడ్యుకేషన్ చట్టం ఆమోదించబడిందని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా నివేదించింది. ఈ సందర్భంగా... బలమైన దేశాన్ని నిర్మించడానికి, బలమైన శక్తిని రూపొందించడానికి ఈ చట్టం సహాయపడుతుందని చైనా అత్యున్నత చట్టసభ సభ్యుడు జావో లేజీ అన్నారని జిన్హువా నివేదించింది.

అవును... "చారిత్రక శూన్యవాదం", "జాతీయ ఐక్యత" వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి చైనా జాతీయ శాసనసభ పిల్లలు, కుటుంబాలకు దేశభక్తి విద్యను బలోపేతం చేయడానికి ఒక చట్టాన్ని ఆమోదించింది. ఇందులో భాగంగా ఈ పేట్రియాటిక్ ఎడ్యుకేషన్ చట్టం దేశభక్తి విద్యను నిర్వహించడం కోసం చట్టపరమైన హామీని అందిస్తుందని తెలిపింది. ఈ సందర్భంగా "కొంతమందికి దేశభక్తి అంటే ఏమిటో తెలియకుండా ఉంది" అని జిన్హువా పేర్కొంది.

జనవరి 1, 2024 నుండి అమలులోకి వచ్చే చట్టం.. కేంద్ర, స్థానిక ప్రభుత్వ విభాగాలతో పాటు పాఠశాలలు, కుటుంబాలకు సంబంధించిన బాధ్యతలను వివరిస్తుందని చెబుతున్నారు. వాస్తవానికి "చారిత్రక శూన్యవాదం" అనేది చైనాలో గతంలో జరిగిన సంఘటనల గురించి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వివరణపై ప్రజల సందేహాన్ని వివరించడానికి ఉపయోగించే పదం!

ఇది దేశభక్తిని పెంపొందించడానికి రూపొందించబడినప్పటికీ.. చట్టం హేతుబద్ధంగా, అందరినీ కలుపుకొనిపోతూ.. ఓపెన్ మైండెడ్‌ గా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతుందని.. ఇతర నాగరికతలను స్వీకరించడం అనే విషయాన్ని గుర్తుచేస్తుందని జిన్హువా వెల్లడించింది. ఇదే సమయంలో... దేశభక్తి విద్య అనేది ఇతర దేశాల చరిత్ర, సాంస్కృతిక సంప్రదాయాలను సైతం గౌరవించాలని ఈ చట్టం ఆదేశించిందని చెబుతున్నారు.

అయితే ఈ చట్టం ముఖ్య ఉద్దేశంలో మరో పార్శ్వాన్ని కూడా చైనా డైలీ తెలిపింది. ఇందులో భాగంగా... ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, గ్రామస్తులతోపాటు ముఖ్యంగా... ప్రత్యేక పరిపాలనా ప్రాంతాలైన హాంకాంగ్, మకావు, తైవాన్‌ లలోని వివిధ సమూహాల వ్యక్తులు లక్ష్యంగా ఈ చట్టం చర్యలు తీసుకోనుందని తెలిపింది!

డ్రాఫ్ట్ లో పొందుపరిచిన అంశాల్లో కొన్ని...:

పేట్రియాటిక్ ఎడ్యుకేషన్ లా (డ్రాఫ్ట్) లో చైనా ప్రభుత్వం ఐదు చాప్టర్లతో 38 ఆర్టికల్స్ ని పొందుపరిచింది. వీటిలో కొన్ని ప్రధానమైన విషయాలు ఇలా ఉన్నాయి. ఆర్టికల్ 1 ప్రకారం... "ఈ చట్టం రాజ్యాంగం ఆధారంగా రూపొందించబడింది. తద్వారా యుగంలో దేశభక్తి విద్యను బలోపేతం చేయడానికి, దేశభక్తి స్ఫూర్తిని అందించడానికి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఆధునిక సోషలిస్ట్ దేశాన్ని నిర్మించడానికి, అద్భుతమైన శక్తిని కేంద్రీకరించడానికి చైనీస్ ప్రజల గొప్ప పునరుజ్జీవనం".

ఆర్టికల్ 3 ప్రకారం... "దేశభక్తి విద్య చైనీస్ లక్షణాలతో సోషలిజం యొక్క గొప్ప పథకాన్ని ఎగురవేస్తుంది. మార్క్సిజం-లెనినిజం, మావో జెడాంగ్ ఆలోచన, డెంగ్ జియావోపింగ్ సిద్ధాంతం, మూడు ప్రతినిధుల సిద్ధాంతం, అభివృద్ధిపై శాస్త్రీయ దృక్పథం, జి జిన్‌ పింగ్ ఆలోచనల మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటుంది".

ఆర్టికల్ 4 ప్రకారం... "దేశభక్తి విద్య అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా నాయకత్వానికి కట్టుబడి, ఏకీకృత నాయకత్వం మరియు ఉమ్మడి నిర్వహణ కోసం పని నిర్మాణాలను పూర్తి చేయడం". ఆర్టికల్ 5 ప్రకారం... "దేశభక్తి విద్య అనేది సైద్ధాంతిక నాయకత్వం, సంస్కృతి యొక్క పరిరక్షణ".