Begin typing your search above and press return to search.

ఇదేందయ్యా ఇది... అప్పులున్నోళ్లకి అక్కడ సరికొత్త శిక్షలు!

ఈ ప్రపంచంలో నియంత పాలనలో ఉన్న దేశాల పేరు చెప్పగానే ఉత్తర కొరియా పేరు తెరపైకి వస్తుందనేది తెలిసిన విషయమే

By:  Tupaki Desk   |   19 April 2024 11:30 AM GMT
ఇదేందయ్యా ఇది... అప్పులున్నోళ్లకి అక్కడ సరికొత్త శిక్షలు!
X

ఈ ప్రపంచంలో నియంత పాలనలో ఉన్న దేశాల పేరు చెప్పగానే ఉత్తర కొరియా పేరు తెరపైకి వస్తుందనేది తెలిసిన విషయమే! అయినప్పటికీ... అనాధికారిక నియంతృత్వ పోకడలతో కూడిన పాలనకు చైనా కేరాఫ్ అడ్రస్ అనే మాటలు కూడా బలంగా వినిపిస్తుంటాయి. ఈ విషయంలో రెండు దేశాల్లోనూ పెద్దగా తేడాలు ఉండవని చెప్పేవారూ లేకపోలేదు! ఆ సంగతి అలా ఉంటే... తాజాగా చైనా ఓ కీలక నిర్ణయం తీసుకుందనే విషయం తెరపైకి వచ్చింది.

అవును... కరోనాకు ముందు బలమైన ఆర్ధిక శక్తిగా ఉన్న చైనా.. కోవిడ్ మహమ్మారి తర్వాత ఏర్పడిన ఆర్థిక అస్థిరతల నేపథ్యంలో.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ అప్పుల కుప్పగా మారిపోయిందనే చర్చ బలంగా నడుస్తోంది. ఇందులో భాగంగా భారీ కంపెనీలు సైతం ఆర్ధికంగా దివాలా తీసేసిన పరిస్థితి అని అంటుంటారు. ఈ క్రమంలోనే చైనా తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా... ఆదేశ ప్రజలు తమ అప్పులను తీర్చటంలో విఫలమైతే అష్టకష్టాలు ఎదుర్కోక తప్పదని తెలుస్తోంది. తాజాగా అక్కడి ప్రభుత్వం లోన్ డిఫాల్ట్ అయిన వ్యక్తుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుందని తెలుస్తుంది. ఇందులో భాగా అలాంటి వ్యక్తులు.. హైస్పీడ్ రైలు సేవలు, విలాసవంతమైన హోటళ్లలో స్టేతో పాటు ఇతర ఖర్చుల పరిమితులు వంటి తీవ్రమైన షరతులను ఎదుర్కోనున్నారు.

ఇలాంటి వారిని గుర్తించిన చైనా ప్రభుత్వం... ఈ క్రమంలో మిలియన్ల మంది వ్యక్తులకు వివిధ సేవలు, విలాసాలను నిరోధించి, వారందరినీ బ్లాక్ లిస్ట్‌ లో ఉంచిందని తెలుస్తుంది. ఇది 2019 చివరి నుంచి దాదాపు 50% పెరిగిందని అంటున్నారు. దీంతో... అప్పుల బాధలో ఉన్న వ్యక్తులు తిరిగి పుంజుకునే సామర్థ్యాన్ని ఈ నిర్ణయాలు పరిమితం చేస్తాయని.. ఈ పద్ధతి అన్యాయమని కొందరు చైనీస్ నిపుణులు అక్కడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని సమాచారం!