Begin typing your search above and press return to search.

ప్రమాదం ముంగిట చైనా.. ఇదే జరిగితే ఇక అంతే!

భారత్‌ పొరుగు దేశం చైనా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.

By:  Tupaki Desk   |   21 April 2024 1:30 AM GMT
ప్రమాదం ముంగిట చైనా.. ఇదే జరిగితే ఇక అంతే!
X

భారత్‌ పొరుగు దేశం చైనా అన్ని రంగాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికాతో పోటీ పడుతోంది.

ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే మరోవైపు చైనా దారుణమైన ప్రమాదం ముంగిట ఉంది. ఆ దేశంలో పలు ప్రాంతాలు కొన్నేళ్లుగా కుంగిపోతున్నాయి.

దీంతో చైనాలోని పట్టణ జనాభాలో దాదాపుగా మూడింట ఒక వంతు మంది ప్రమాదంలో ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

చైనాలోని నగరాలు, పట్టణాల్లో మానవ కార్యకలాపాల వల్ల భూమి కుంగిపోతోంది. అంతేకాకుండా వాతావరణ మార్పులు కూడా ఇందుకు కారణమవుతున్నాయి. ఇంకోవైపు శిలాజ ఇంధనాల వినియోగంతో సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. అభివృద్ధి పేరిట జరుగుతున్న విధ్వంసం, విపరీతంగా తవ్వకాలు, నదుల ప్రవాహ మార్గాలను మార్చి ప్రాజెక్టుల నిర్మాణం, బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం తదితర కారణాలతో చైనా కుంగిపోతోంది.

ఈ నేపథ్యంలో చైనాలోని టియాంజిన్‌తో సహా తీర ప్రాంత నగరాలు ఎక్కువ ప్రభావితమవుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 2120 నాటికి చైనాలో పట్టణ జనాభా మూడు రెడ్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు అంచనాకొచ్చారు. దీంతో అప్పటికి భారీ అంతస్తుల బహుళ నిర్మాణాల బరువు, సముద్ర మట్టాల పెరుగుదలతో 55 నుంచి 128 మిలియన్ల మందిపై ప్రభావం పడుతోందని అంటున్నారు.

ఇప్పటికే చైనాలో అతిపెద్ద నగరం, ఆ దేశ ఆర్థిక రాజధానిగా పేరున్న షాంఘై గత శతాబ్ధకాలంలో 3 మీటర్ల వరకు కుంగిపోయింది. యునైటెడ్‌ కింగ్‌ డమ్‌ లోని యూనివర్సిటీ ఆఫ్‌ ఈస్ట్‌ ఆంగ్లియా పరిశోధకుల సహాయంతో చైనా బృందం ఈ అధ్యయనం నిర్వíß ంచింది. ఈ మేరకు శాస్త్రవేత్తల బృందం 700 మిలియన్ల జనాభా ఉన్న షాంఘై, బీజింగ్‌ నగరాలతో పాటు 82 నగరాలపై అధ్యయనం చేసి వివరాలను వెల్లడించింది.

శాస్త్రవేత్తలు చెబుతున్నదాని ప్రకారం.. చైనా పట్టణ భూభాగంలో 45 శాతం కుంగిపోతోంది. ఈ క్రమంలో సంవత్సరానికి 10 మిల్లిమీటర్ల చొప్పున 16 శాతం ప్రాంతం కుంగిపోతోందని శాస్త్రవేత్తలు బాంబు పేల్చారు. సుమారు 70 మిలియన్ల జనాభా ఏడాదికి 10 మి.మీ లేదా అంతకన్నా ఎక్కువ వేగంగా భూమి కుంగుబాటు సమస్యను ఎదుర్కొంటున్నారని తెలిపారు.