Begin typing your search above and press return to search.

అమెరికాకు ఊహించని స్థాయిలో చైనా హెచ్చరికలు.. ఎందుకంటే..?

ఈ సమయంలో తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలపై చైనా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. నిప్పుతో ఆడుకోవద్దంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది.

By:  Tupaki Desk   |   1 Jun 2025 5:20 AM
అమెరికాకు ఊహించని స్థాయిలో చైనా హెచ్చరికలు.. ఎందుకంటే..?
X

అమెరికా - చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే! ప్రధానంగా ట్రంప్ రెండోసారి యూఎస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత పరిస్థితులు మరింత వేడెక్కాయని అంటున్నారు. ఈ సమయంలో తాజాగా అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలపై చైనా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. నిప్పుతో ఆడుకోవద్దంటూ మాస్ వార్నింగ్ ఇచ్చింది.

అవును... సింగపూర్ లో జరిగిన అంతర్జాతీయ భద్రతా సదస్సులో మాట్లాడిన అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్.. చైనాపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... భౌగోళిక, సముద్ర వివాదాల పరిష్కారంతో పాటు తైవాన్ విషయంలో చైనా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని అన్నారు. లాటిన్ అమెరికాపైనా చైనా కన్నేసిందని ఆరోపించారు.

ఇదే సమయంలో.. భవిష్యత్తులో చైనా నుంచి వచ్చే ముప్పును, ప్రధానంగా తైవాన్ పై దాని దూకుడును ఎదుర్కోవడానికి అమెరికా విదేశాల్లో తన రక్షణను బలోపేతం చేస్తోందని పీట్ అన్నారు. తైవాన్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా దాని సముద్రజలాల్లో యుద్ధ విమాన నౌకలను మొహరిస్తూ బెదిరింపులకు పాల్పడుతోందని పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై చైనా ధీటుగా స్పందించింది. ఇండో-పసిఫిక్ లో చైనా దూకుడు ప్రదర్శిస్తే దాన్ని అమెరికా అడ్డుకుంటుందంటూ పీట్ చేసిన వ్య్యాఖ్యలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పందించారు. ఈ సందర్భంగా.. పీట్ హెగ్సెత్ వ్యాఖ్యలను తప్పుపడుతూ.. అమెరికాకు గట్టి హెచ్చరికలు చేశారు.

ఇందులో భాగంగా... చైనాను అదుపు చేసేందుకు తైవాన్ సమస్యను అమెరికా తీసుకురావడం సరికాదని లిన్ జియాన్ పేర్కొన్నారు. అసలు తైవాన్ అంశం అనేది చైనా పూర్తి అంతర్గత వ్యవహారమని.. దీనిలో మూడో దేశం జోక్యం మానుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే.. నిప్పుతో ఆడుకోవద్దంటూ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.