ఆడవేషంలో మగాళ్ల ప్రైవేట్ వీడియోలు తీసి... 1691 మందివి అమ్మేశాడు!
ఈ విషయం ఇలానే ఈజీ మనీ కోసం ఓ వ్యక్తి ఆడవేషం ధరించి ఆన్ లైన్ వేదికగా మగాళ్లను ఆకర్షించాడు! వందల మందిని తన బాధితులుగా మర్చేశాడు!
By: Tupaki Desk | 12 July 2025 3:00 PM ISTమోసపోయేవాళ్లు ఉండాలే కానీ.. మోసం చేసేవాళ్లకు, వాళ్లు ఎంచుకునే మార్గాలకు కొదవేముంటుంది? ఎవరు మోసం చేసినా, ఏ విధంగా మోసం చేసినా.. దాదాపు ప్రతీ మోసానికీ కారణం ఈజీ ఎర్నింగ్స్! ఈ విషయం ఇలానే ఈజీ మనీ కోసం ఓ వ్యక్తి ఆడవేషం ధరించి ఆన్ లైన్ వేదికగా మగాళ్లను ఆకర్షించాడు! వందల మందిని తన బాధితులుగా మర్చేశాడు!
అవును... సులువుగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంగా ఓ వ్యక్తి ఉన్నంతలో వినూత్న ఆలోచన చేశాడు! ఇందులో భాగంగా ఆడవేషం వేసి, ఆన్ లైన్ వేదికగా మగాళ్లను ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో... మైకంలో కళ్లు మూసుకుపోయాయో.. లేక, వాళ్ల తలారాత అలా ఉందో ఏమో కానీ.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 1600 మంది దెబ్బతిన్నారు!
వివరాళ్లోకి వెళ్తే... తూర్పు చైనా, జియాగ్సు ప్రావిన్స్ లోని నజియాంగ్ సిటీకి చెందిన జియావో అనే వ్యక్తి సులువుగా డబ్బు సంపాదించాలని ఓ మోసానికి తెరలేపాడు! ఇందులో భాగంగా.. ఆడవేషం వేసి ఆన్ లైన్ లో మగాళ్లను ఆకర్షించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో వారిని తన రూముకు రప్పించుకునే వాడు. ఆ రూములో సీక్రెట్ కెమెరా అమర్చేవాడు.
వాళ్లు గదిలోకి రాగానే సీక్రెట్ కెమెరా ఆన్ చేసే వాడు. వచ్చిన వ్యక్తి న్యు*డ్ గా మారిన తర్వాత వీడియో రికార్డ్ చేసి, అనంతరం ఇంట్లో వాళ్లు వస్తున్నారనో, మరో కారణమో చెప్పి బయటకు పంపించేసేవాడని తెలుస్తోంది! అయితే.. అప్పటికే ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డు అయిన వీడియోలను ఆన్ లైన్ ద్వారా అమ్మేసేవాడు.
అలా సుమారు 1,691 మంది మగాళ్ల ప్రైవేట్ వీడియోలను ఆన్ లైన్ లో అమ్మాడు. ఈ సమయంలో ఒక్కో వీడియోకు సుమారు 150 యాన్లు తీసుకునేవాడు. అంటే.. మన భారత కరెన్సీలో దాదాపు రూ.1800 అన్నమాట! ఈ క్రమంలో కొంతమంది ప్రైవేట్ వీడియోలు, ఫొటోలు చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ లో వైరల్ గా మారాయి.
దీంతో... అందులోని వ్యక్తుల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో పాటు భార్యలు కూడా చూడటంతో.. జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగేదని అంటున్నారు! దీంతో... బాధితుల్లో పలువురు పోలీసులకు ఫిర్యాదు చేయండంతో జియావోను అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి పంపించారు.
