దోమలను యుద్ధంలోకి దింపుతున్న చైనా.. ప్రయోగం ఫలించేనా..?
తర్వాత చిన్నా చిన్న వైరస్ లు వచ్చినా అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పటికీ చైనాలో ఏ చిన్న వైరస్ గురించి అలర్ట్ వచ్చినా ప్రపంచం యావత్తు ఉలిక్కిపడుతుంది.
By: Tupaki Desk | 6 Aug 2025 3:44 PM ISTయుద్ధం అంటే ఏంటి..? చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. ఒక ప్రాంతం, ప్రదేశం దక్కించుకునేందుకు చేసేవి.., తమ అభిమానాన్ని చాటుకునేందుకు చేసేవి.., స్వాతంత్రం కోసం చేసేవి.., ఇలా చెప్పుకుంటూ పోతే చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. యుద్ధాలు చేసే విధానాన్ని చైనా ఎప్పుడో మార్చివేసింది. ఉదాహరణకు కొవిడ్ వైరస్ ను బయటకు వదిలింది. ఇది ప్రపంచాన్నే ఒక్క కుదుపు కుదిపి.. కోట్లాది మందిని పొట్టన బెట్టుకుంది. ఆర్థిక పరిస్థితిని చిన్నా భిన్నం చేసింది. ఎంతో మంది సొంత వాళ్లను పోగొట్టుకొని దిక్కుదోచని స్థితిలో పడిపోయారు. కొవిడ్ 1, 2, 3 వేవ్స్ లో చాలా దేశాలు చైనాపై గుర్రుగా ఉన్నాయి. ఆ తర్వాత వ్యాక్షిన్.. వైరస్ ను శరీరం ఎదుర్కొంటుండడంతో కొంత వరకు దాని ప్రభావాన్ని తగ్గించుకుంది.
వైరస్ లతో సతమతం అవుతున్న చైనా..
తర్వాత చిన్నా చిన్న వైరస్ లు వచ్చినా అవి పెద్దగా ప్రభావం చూపించలేదు. ఇప్పటికీ చైనాలో ఏ చిన్న వైరస్ గురించి అలర్ట్ వచ్చినా ప్రపంచం యావత్తు ఉలిక్కిపడుతుంది. ఇటీవల చైనాలో ఒక వైరస్ విపరీతంగా విజృభిస్తుంది. దీన్ని కట్టడి చేసేందుకు చైనా వింత వింత పోరాటు చేస్తుంది. సదరు వైరస్ వ్యాపించకుండా దోమలతో యుద్ధం చేయిస్తుంది. ఈ విషయం తెలిసి ప్రపంచం అవాక్కయ్యింది. చాలా రకాల దోమల వల్ల మనుషులు, జంతువులకు ప్రమాదమే. ఒక్కో దోమ తీసుకువచ్చే వైరస్ లు రోజుల్లోనే మనుషులను మట్టుబెడతాయి. అలాంటి దోమలనే వైరస్ ల పైకి యుద్ధానికి పంపడం చూస్తుంటే నిజంగా అవాక్కవ్వాల్సిందే.
గన్యా వైరస్ అసలు కథేంటి..?
చైనాలోని దక్షిణ ప్రాంతానికి చెందిన గ్వాంగ్ గాంగ్ లో ప్రావిన్స్ పరిధిలోని ఫోషన్ నగరంలో ఇటీవల ఒక వైరస్ విజృంభిస్తుంది ఆ వైరస్ పేరు ‘గన్యా’. ఒక్క నెల రోజుల్లోనే 7వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇది దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. 20 సంవత్సరాల నుంచి పరిశీలిస్తే ఈ వైరస్ ఇంత పెద్దగా వ్యాప్తి చెందడం ఇదే మొదటిసారి. 2008లో ఇదే తరహాలో వ్యాపించింది. ఈ వైరస్ కట్టడికి తక్షిణ చర్యలు చేపట్టింది. కోవిడ్ సమయంలో తీసుకువచ్చినట్లు ఆంక్షలను పెట్టింది.
రంగంలోకి చైనా రక్షణ దళం..
సైన్యాన్ని అలర్ట్ చేసింది. ప్రభుత్వ ఆంక్షలను పాటించేలా చూడాలని ఆదేశించింది. వీధుల్లో ఫాగింగ్ చేయాలని కార్మిక సిబ్బందికి సూచించింది. డ్రోన్ల ద్వారా పరిసరాలను, దోమలను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దోమలపై యుద్ధం చేసేందుకు ఎలిఫెంట్ దోమలను రంగంలోకి దించింది. దోమలను ఆహారంగా తీసుకునే చేపలను కూడా కాల్వల్లోకి వదిలింది.
‘ఎలిఫెంట్ మస్కిటో’ గురించి..
వజ్రాన్ని కోయాలంటే వజ్రమేకావాలి. అదే విధంగా దోమలను చంపాలంటే దోమలనే ఉపయోగించాలని అక్కడి పరిశోధకులు ప్రభుత్వానికి చెప్పడంతో ఈ ఎలిఫెంటో మస్కిటోలను రంగంలోకి దింపారు. ఈ దోమ జాతి ప్రపంచ దోమ జాతుల్లో కెల్లా అతిపెద్దది. ఒక్కో దోమ 18 మిల్లీ మీటర్ల నుంచి 24 మి.మి వరకు పెరుగుతంది. అస్ట్రేలియా, అమెరికాతో పాటు ఆసియా దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటిలో 90 రకాల వరకు ఉన్నాయి. ఇవి అడవులనే ఆవాసంగా చేసుకుంటాయి.
సంతానోత్పత్తి ఇలా..
వీటితో మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదు. దోమ జాతిలో చాలా వరకు దోమలు మనుషుల రక్తాన్ని తాగుతాయి. కానీ ఎలిఫెంట్ మస్కిటో జాతిలో ఆడదోమలైనా సరే చెట్ల నుంచి వచ్చే రసాన్ని పీల్చే జీవిస్తాయి. కార్బో హైడ్రైట్ ఉన్న ఆహారం తీసుకుంటూ.. ఇవి కూడా రాత్రి వేళల్లో నిద్రపోతాయట. ఈ జాతి ఆడ దోమలు సాధారణ దోమల్లానే నీటి ఉపరితలంపై గుడ్లు పెడతాయి. వీటి పొదిగే కాలం చాలా వేగంగా ఉంటుంది. అంటే కేవలం 40 నుంచి 60 గంటల్లోనే గుడ్ల నుంచి లార్వాలు బయటకు వస్తాయి. వచ్చిన లార్వాలు సమీపంలోని ఇతర దోమ జాతికి చెందిన గుడ్లను మాత్రమే తింటాయి. ఒక్క లార్వా 100కు పైగా గుడ్లను తింటుంది. ఇలా ఇతర దోమల వ్యాప్తి పూర్తిగా అరికట్టవచ్చు. అందుకే చైనా ఈ దోమలను యుద్ధానికి ఎన్నుకుంది.
