బుల్లి దేశంపై దుష్ట చైనా కన్ను... కలిపేసుకునే కుట్ర!
చైనా అంటే అంతే...! అసలు దాని వైశాల్యంలో ఇప్పటికే మూడో వంతు ఇరుగు పొరుగు దేశాల నుంచి కబ్జా పెట్టిందని అంటారు.
By: Tupaki Desk | 11 Sept 2025 11:00 PM ISTచైనా అంటే అంతే...! అసలు దాని వైశాల్యంలో ఇప్పటికే మూడో వంతు ఇరుగు పొరుగు దేశాల నుంచి కబ్జా పెట్టిందని అంటారు. భారత్ వంటి పెద్ద దేశానికి చెందిన భూమినీ ఆక్రమించించింది అంటే డ్రాగన్ ఎంత దుష్టబుద్ధో తెలిసిపోతోంది...! వాస్తవానికి 1950ల మొదట్లో వరకు టిబెట్ స్వతంత్ర దేశం. దానిని కలిపేసుకుంది చైనా..! తైవాన్ అనే ద్వీపం తమదే అంటుంది...! మంగోలియా అనే దేశంలో కొంత గుంజేసుకుని ఇన్నర్ మంగోలియాగా వ్యవహరిస్తోంది..! ఇక భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌పై ఎప్పటినుంచో వివాదాలు సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాలను తమవిగా పేర్కొంటూ మ్యాప్‌లు విడుదల చేసింది. నేపాల్‌నూ కబళించే ఆలోచన లోలోన ఉందేమో కానీ...పైకి మాత్రం సాయం చేస్తున్నట్లు నటిస్తుంది. ఇప్పుడు చైనా కన్ను ఓ బుల్లి దేశంపై పడింది అని తెలుస్తోంది.
పొరుగునే ఉన్న ప్రశాంత దేశం..
భూటాన్.. భారత్-చైనా మధ్యన బుల్లి దేశం. ప్రశాంతతకు మారుపేరు. రాచరికం ఉన్న ఈ దేశంలో ప్రజలు శాంతి కాముకులు. చైనాతో కంటే భారత్‌తోనే భూటాన్‌కు అనుబంధం ఎక్కువ అనుకోవాలి. అయితే, చైనా బతకనిస్తుందా..? ఇప్పుడు భూటాన్‌లోని కొన్ని ప్రాంతాలపై డ్రాగన్ తన కబ్జా పంజా విసరనుంది అని చెబుతున్నారు.
75 ఏళ్లుగా వివాదం..
చైనాతో గట్టు పంచాయతీ లేని ఏ పొరుగు దేశమూ లేదు. అలానే భూటాన్ కూడా. 1950ల్లోనే ఈ విషయమై వివాదం తలెత్తింది. 2020లో ఓ వింత వాదనను తెరపైకి తెచ్చింది. చైనా ఆధీనంలోని టిబెట్ సరిహద్దులో కాకుండా భారత్‌కు చెందిన అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న సక్తెంగ్ వన్యప్రాణుల అభయారణ్యం తమదే అని ఆరోపించింది.
భూటాన్ సైన్యాన్ని అడ్డుకుని...
భూటాన్ సైన్యం పేరు రాయల్ భూటాన్ ఆర్మీ. వీరు అమో-చు నది తూర్పు ఒడ్డున ఉన్న క్రాసింగ్‌ను తనిఖీ చేయడానికి వెళ్లగా అప్పటికే తిష్ఠవేసిన చైనా సైన్యం అడ్డుకుంది. చైనా దురాక్రమణను పకడ్బందీగా చేస్తుంది. లక్ష్యంగా చేసుకున్న దేశంలోకి ముందుగా గొర్రెల కాపరులను పంపుతుంది. ఇలా వచ్చిన కాపరులను భూటాన్ సైన్యం టిబెట్ సరిహద్దులో అడ్డుకుంది. ఇది చైనాకు ఆగ్రహం తెప్పించింది.
-2021 అక్టోబరులో చైనా-భూటాన్ త్రీ స్టెప్ రోడ్ మ్యాప్ ఒప్పందంపై సంతకం చేశాయి. గత ఎనిమిదేళ్లలో భూటాన్ లో 20 పైగా కొత్త గ్రామాలు వెలిశాయి. వివాదాస్పద డోక్లాంలోనే 8 గ్రామాలు పుట్టుకొచ్చాయట. ఇవన్నీ చైనా బలగాలు ఏర్పాటు చేసినవే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా..?
