Begin typing your search above and press return to search.

సంతానలేమికీ కారుసీటుకీ సంబంధం ఉంది గురూ!

ఈ క్రమంలో వాటితోపాటు కారు సీటు కూడా ఒక కారణం అంటున్నారు పరిశీలకులు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 12:30 PM GMT
సంతానలేమికీ కారుసీటుకీ సంబంధం ఉంది గురూ!
X

ఇటీవలి కాలంలో సంతానలేమి సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఆ బాధ అనుభవించేవారికే తెలుసని చెబుతుంటారు. అయితే సంతానలేమికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతుంటారు వైద్యులు. ఆహారపు అలవాట్లు, కాలుష్యం, వ్యాయామం లేకపోవడం, మద్యపానం, దూమపానం మొదలైనవి కారణాలుగా చెబుతారు. ఈ క్రమంలో వాటితోపాటు కారు సీటు కూడా ఒక కారణం అంటున్నారు పరిశీలకులు.

అవును... సంతానలేమి సమస్యకు ఉన్న అనేక కారణాల్లో కారు సీటు కూడా ఒకటని తాజా పరిశోధనలో వెల్లడైందని అంటున్నారు. కారు సీటు వేడిగా ఉండటం శుక్రకణాల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందని.. ఫలితంగా అది సంతానలేమికి కారణం అవుతోందని తాజా అధ్యయనంలో తేలిందని చెబుతున్నారు.

వాస్తవానికి సంతానోత్పత్తికి అవసరమైన వీర్యకణాల ఉత్పత్తి సజావుగా, సక్రమంగా జరగాలంటే పురుషుల శరీరంలోని మిగిలిన భాగాల కంటే వృషణాల వద్ద చల్లగా ఉండాలని తాజా అధ్యయనం పేర్కొంది. కారులోనో, బైక్‌ పైనో ప్రయాణిస్తున్నప్పుడు సీటు వేడిగా ఉండడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోతుందని అధ్యయన కారులు చెబుతున్నారు.

ఇలా కారు, బైక్‌ పై ఎక్కువ దూరం ప్రయాణించడంతోపాటు బిగుతైన ప్యాంట్లు ధరించడం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుందని చెబుతున్నారు అధ్యయనకారులు. వింటర్ లో వెచ్చని సీట్లు హాయిని ఇస్తాయి కానీ.. ఇది దీర్ఘకాలం కొనసాగితే వీర్యం ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా స్పందించిన రీప్రొడక్టివ్ మెడిసిన్ కన్సల్టెంట్, కింగ్స్ ఫెర్టిలిటీ డైరెక్టర్ డాక్టర్ ఇప్పోక్రటిస్ సారిస్... సంతానం కోసం ప్రయత్నించేవారు చలికాలంలో వారి పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

ఇదే సమయంలో... టైట్ ప్యాంట్లు ధరించడం, వాహనంపై ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కూడా వీర్యం ఉత్పత్తి తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ ఆండ్రాలజీ ప్రొఫెసర్ అలన్ పేసీ పేర్కొన్నారు.