Begin typing your search above and press return to search.

ఇది తెలిస్తే.. సీఎం రేవంత్ మీద అభిమానం డబుల్ పక్కా

సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు పాత కార్లను వాడేందుకు ఇష్టపడరు. అందునా.. బ్రాండ్ న్యూ కార్లను వాడేస్తుంటారు

By:  Tupaki Desk   |   25 Jan 2024 9:29 AM GMT
ఇది తెలిస్తే.. సీఎం రేవంత్ మీద అభిమానం డబుల్ పక్కా
X

అధికారం చేతిలో ఉన్న వేళ ఇష్టారాజ్యంగా నిర్ణయాలను తీసుకోవటం.. చేతికి ఎముక లేనట్లుగా ఖర్చు చేయటం లాంటివి ఇటీవల కాలంలో చాలా కామన్ గా మారింది. ప్రజాజీవితంలో ఉన్న వారి చేతికి పవర్ వస్తే.. అప్పటి వరకు తమకు లేని వసతుల కోసం వందల కోట్ల రూపాయిల ప్రజాధనాన్ని వెనుకా ముందు చూసుకోకుండా ఖర్చు చేయటమేకాదు.. ఆ సందర్భంగా వచ్చే విమర్శల్ని అస్సలు పట్టించుకోని పరిస్థితి. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన్ను విమర్శించే వారు.. ఆయనంటే సదభిప్రాయం లేని వాళ్లు సైతం ముఖ్యమంత్రిగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ఆకర్షితులవుతున్నారు. అభిమానిస్తున్నారు. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం గురించి తెలిస్తే షాక్ తినటమే కాదు.. వెంటనే ఆయనకు పెద్ద ఫ్యాన్ గా మారిపోతారంతే.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఖరీదైన కాన్వాయ్ ను తీసుకొస్తామని చెబితే నో అంటే నో అనేసిన రేవంత్ గురించి తెలిసిందే. విపక్ష నేతగా ఉన్నప్పటి నుంచి తాను వాడుతున్న వాహనాన్ని ఆయన వాడుతున్నారు. ఆయన కారు బ్లాక్ కలర్ లో ఉండటం.. మిగిలిన కాన్వాయ్ వాహనాలు వైట్ కలర్ లో ఉండటం తెలిసిందే. దీంతో.. భద్రతా సమస్యలు వస్తాయని.. బ్లాక్ కలర్ కార్లను కొనేందుకు అనుమతులు కోరారు అధికారులు. అందుకు నో చెప్పిన రేవంత్.. ఇప్పటికే వాడుతున్న వైట్ కలర్ కార్లకు బ్లాక్ కలర్ వేయాలని ఆదేశించారు.

సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వారు పాత కార్లను వాడేందుకు ఇష్టపడరు. అందునా.. బ్రాండ్ న్యూ కార్లను వాడేస్తుంటారు. అందుకు భిన్నంగా ఉన్న కార్లను వాడటమే కాదు.. వాటికి రంగు మార్చాలని కోరటం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల దావోస్ టూర్ కు వెళ్లిన సందర్భంగా సీఎం రేవంత్ కాన్వాయ్ వాహనాలు అన్నింటికి బ్లాక్ కలర్ వేయించారు. దీంతో.. ఇప్పుడు ఆయన కాన్వాయ్ వాహనాలు మొత్తం బ్లాక్ కలర్ లోకి వచ్చేశాయి. ఇది తెలిసిన వారంతా విస్మయానికి గురవుతున్నారు. సీఎం హోదాలో ఉండి ఖర్చు చేసే ప్రతి పైసాను ఆచితూచి అన్నట్లుగా చేస్తున్న వైనానికి ఫిదా అవుతున్నారు. కొత్త కార్లను కొనటం ద్వారా అదనపు ఖర్చు ఏందుకన్నది ముఖ్యమంత్రి మాటగా చెబుతున్నారు. దావోస్ పర్యటన తర్వాత బుధవారం సచివాలయానికి వచ్చిన రేవంత్.. రంగు మార్చిన తన పాత కార్ల కాన్వాయ్ లో రావటంతో ఆయన సింపుల్ సిటీ మరోసారి చర్చగా మారింది.