Begin typing your search above and press return to search.

చికెన్ ఉత్పత్తిలో మహారాష్ట్ర ముందు.. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ?

రాజస్థాన్.. జార్ఖండ్.. మధ్యప్రదేశ్.. గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ లో చికెన్ వినియోగం అతి తక్కువగా ఉందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

By:  Tupaki Desk   |   8 Jun 2025 4:00 PM IST
చికెన్ ఉత్పత్తిలో మహారాష్ట్ర ముందు.. తెలుగు రాష్ట్రాలు ఎక్కడ?
X

ఇటీవల కాలంలో మాంసాహార వినియోగం అంతకంతకూ ఎక్కువ అవుతున్న సంగతి తెలిసిందే. వినియోగం సరే ఉత్పత్తి మాటేమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే.. ఆసక్తికర అంశాలు వెల్లడవుతాయి. దేశంలో అత్యధిక చికెన్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగామహారాష్ట్ర నిలిచింది. 2023-24లో దేశ వ్యాప్తంగా 50.19 లక్షల టన్నులు (టన్ను అంటే వెయ్యి కేజీలు) చికెన్ ఉత్పత్తి అయినట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో మహారాష్ట్ర వాటా 7.56 లక్షల టన్నులతో మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ (6.75 లక్షల టన్నులు).. మూడో స్థానంలో హర్యానా (6.36 లక్షల టన్నులు).. నాలుగో స్థానంలో తమిళనాడు (5.58 లక్షల టన్నులు).. ఐదో స్థానంలో తెలంగాణ (5.10 లక్షల టన్నుల) నిలిచాయి.

రాజస్థాన్.. జార్ఖండ్.. మధ్యప్రదేశ్.. గుజరాత్.. హిమాచల్ ప్రదేశ్ లో చికెన్ వినియోగం అతి తక్కువగా ఉందన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ఎన్ వీ స్టాట్స్ ఇండియా 2025 పేరుతో విడుదలైన గణాంకాల్ని చూస్తే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. 2023-24లో చికెన్.. మటన్ తో కలిపి అన్ని రకాల మాంసాల ఉత్పత్తి చూస్తే 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తి జరిగినట్లుగా పేర్కొన్నారు.

మొత్తం మాంసాహారం ఉత్పత్తిలో ఏపీ కంటే తెలంగాణ ముందుంది. తెలంగాణలో మొత్తం 11.12 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి జరగ్గా.. ఆంధ్రప్రదేశ్ లో 10.67 లక్షల టన్నుల ఉత్పత్తి జరిగింది. దేశ వ్యాప్తంగా 1.84 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరగ్గా.. 51.58 లక్షలటన్నులతో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

2015-16లో ఏపీలో చేపల ఉత్పత్తి 23.52 లక్షల టన్నులు మాత్రమే కాగా.. ప్రస్తుతం ఇది రెట్టింపు అయినట్లుగా చెప్పాలి. తెలంగాణలో కేవలం 4.56 లక్షల టన్నులచేపలు మాత్రమే ఉత్పత్తి అయ్యాయి. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. గతంతో పోలిస్తే సాగుభూమి స్పల్వంగా పెరగటం. 2019-20లో మొత్తం 21.13 కోట్ల హెక్టార్లలో పంటలు పండగా.. 2022623 నాటికి స్వల్పంగా పెరిగి 21.93కోట్ల హెక్టార్లకు పెరిగినట్లుగా నివేదిక వెల్లడించింది.