Begin typing your search above and press return to search.

కారు డ్రైవర్ ఖాతాలోకి రూ.9వేల కోట్లు.. ఆ తర్వాతేం జరిగిందంటే?

అవును.. ఒక కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.9వేల కోట్ల రూపాయిలు డిపాజిట్ అయిన వైనం వార్తాంశంగా మారింది

By:  Tupaki Desk   |   22 Sep 2023 4:45 AM GMT
కారు డ్రైవర్ ఖాతాలోకి రూ.9వేల కోట్లు.. ఆ తర్వాతేం జరిగిందంటే?
X

అవును.. ఒక కారు డ్రైవర్ బ్యాంకు ఖాతాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.9వేల కోట్ల రూపాయిలు డిపాజిట్ అయిన వైనం వార్తాంశంగా మారింది. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి తెలిస్తే.. చివర్లో ఉండే ట్విస్టు మాత్రం కాస్తంత వెరైటీగా ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు. ఇంతకూ ఆ కారుడ్రైవర్ ఎవరు? ఎక్కడివాడు? అసలేం జరిగిందన్న విషయంలోకి వెళితే..

చెన్నైకు చెందిన రాజ్ కుమార్ కారు డ్రైవర్ గా పని చేస్తుంటారు. అద్దె కారును నడుపుతూ క్యాబ్ సర్వీసులు అందిస్తుంటాడు. ఈ నెల తొమ్మిది సాయంత్రం వేళలో అతని సెల్ ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది. దాని సారాంశం ఏమంటే.. తమిళనాడు మర్కంటైల్ బ్యాంకు నుంచి అతగాడి ఖాతాకు రూ.9వేల కోట్ల జమైనట్లుగా పేర్కొన్నారు. ఇందులో నిజం ఎంత? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు.. మెసేజ్ వచ్చిన తర్వాత.. తన మిత్రుడికి రూ.21 వేల మొత్తాన్ని వాలెట్ ద్వారా పంపాడు. అది కాస్తా సక్సెస్ కావటంతో అతడి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది.

అయితే.. తప్పుగా రూ.9వేల కోట్ల మొత్తాన్ని పంపిన విషయాన్నిగుర్తించిన బ్యాంకువారు.. వెంటనే ఆ మొత్తాన్నివెనక్కి తీసుకున్నారు. అయితే.. తాము పొరపాటుగా వేసిన రూ.9వేల కోట్లలో రూ.21వేలు తగ్గటంతో సదరు కారు డ్రైవర్ ను చెల్లించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో చెన్నైలోని టీనగర్ లోని బ్యాంకు శాఖకు రాజ్ కుమార్ తన తరఫున లాయర్ ను పంపారు. దీంతో బ్యాంకు అధికారులు.. స్నేహితుడికి పంపిన రూ.21 వేల మొత్తాన్ని తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్టంతోపాటు.. సదరు రాజ్ కుమార్ కు కారుకు అవసరమైన లోన్ ను ఇస్తామని చెప్పటం విశేషం.