చెల్లుబోయిన రాజకీయం.. చెల్లట్లేదా.. !
ప్రధానంగా చెల్లుబోయిన మనసంతా రామచంద్రాపురం నియోజకవర్గంపైనే ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ తాను పోటీ చేసి ఉంటే గెలుపు గుర్రం ఎక్కి ఉండేవాడినని ఆయన చెబుతున్నారు.
By: Garuda Media | 6 April 2026 3:00 PM ISTమాజీ మంత్రి.. శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ రాజకీయం చప్పగా సాగుతోందా? ఆయన మాటకు.. విన్నపాలకు కూడా.. పార్టీలో ఎక్కడా పట్టింపు లేకుండా పోయిందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ఆయన మనసు.. ఒకచోట ఉండగా.. పార్టీ మాత్రం మరో చోట కేటాయించింది. వాస్తవానికి ఈ తరహా పరిస్థితిని చాలా మంది ఎదుర్కొంటున్నారు. అయితే.. వారంతా మౌనంగా ఉంటున్నారు.
కానీ, చెల్లుబోయిన అలా ఉండాలని ప్రయత్నిస్తున్నా.. స్థానికంగా ఉన్న సామాజిక వర్గం బాధ్యత.. వారిని మెప్పించడంతో పాటు.. పార్టీ పరంగా పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయన మౌనంగా ఉండలేకపోతున్నారు. నాకు ఏదో ఒకటి తేల్చేయండి... అంటూ పార్టీ అధిష్టానాన్ని ఆయన కోరుతున్నారు. గత రెండు మాసాల నుంచి ఆయన సజ్జల రామకృష్ణారెడ్డికి తరచుగా ఫోన్లు చేస్తున్నారని.. జగన్ అప్పాయింట్ మెంటు కోసం ప్రయత్నిస్తున్నారని సమాచారం.
ప్రధానంగా చెల్లుబోయిన మనసంతా రామచంద్రాపురం నియోజకవర్గంపైనే ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ తాను పోటీ చేసి ఉంటే గెలుపు గుర్రం ఎక్కి ఉండేవాడినని ఆయన చెబుతున్నారు. కానీ.. ఆ ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. కానీ, ఇక్కడ చెల్లుబోయినను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇక, వచ్చే ఎన్నికల్లో అయినా.. తన ఇలాకా రామచంద్రపురం నుంచి పోటీ చేయాలని చెల్లుబోయిన భావిస్తున్నారు. కానీ, ఇక్కడే ముగ్గురు ఈ సీటు కోసంప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
వీరిలో ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లిసుభాష్..తన కుమారుడిని రంగంలోకి దించేయాలని చూస్తున్నా రు. మరోవైపు తనకు కలిసి వచ్చిన సీటుగా చెబుతున్న మరో కీలక నేత కూడా ఇదే ప్రయత్నంలో ఉన్నా రు. దీంతో చెల్లుబోయిన విషయాన్నితేల్చకుండా పార్టీ డైలామాలో పెట్టింది. ఇదే చెల్లుబోయినకు నచ్చడం లేదు. అలాగని బయటకు కూడా రాలేరు. మాజీ మంత్రిగా ఆయన ఇప్పటికీ డిగ్నిటీ మెయిన్‌టెయిన్ చేస్తున్నారు. దీంతో ఆయన స్థానిక కార్యకర్తలకు దూరంగా ఉంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాలు.. చెల్లుబోయిన మాటను చెల్లకుండా చేస్తున్నాయన్న టాక్ వినిపిస్తున్నాయి.
