Begin typing your search above and press return to search.

బ్రేకప్ తో సూసైడ్.. గర్ల ఫ్రెండ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రేమించటం.. బ్రేకప్ చెప్పుకోవటం.. మరొకరితో కనెక్టు కావటం లాంటివి రోటీన్ గా మారాయి.

By:  Tupaki Desk   |   11 April 2024 4:39 AM GMT
బ్రేకప్ తో సూసైడ్.. గర్ల ఫ్రెండ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు
X

ప్రేమించటం.. బ్రేకప్ చెప్పుకోవటం.. మరొకరితో కనెక్టు కావటం లాంటివి రోటీన్ గా మారాయి. గతంలో ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ అంటే.. అంతకు మించిన మహా పాపం లేదన్నట్లుగా ఒకప్పుడు పరిస్థితి ఉండేది.అంతేకాదు.. ప్రేమించిన వ్యక్తితో పెళ్లితో శుభం కార్డు వేయాలన్న తరం వెనక్కి వెళ్లిపోవటం.. ప్రేమలు.. బ్రేకప్ లు అన్నవి పరమ రోటీన్ వ్యవహారంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా అందుక భిన్నమైన విషాదం చోటు చేసుకుంది. ప్రేమించిన అమ్మాయితో బ్రేకప్ ను భరించలేని ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఒక ఎత్తు అయితే.. అతగాడి ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి మీద పోలీసులు కేసు నమోదు చేయటం గమనార్హం. ఇంతకీ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకుంది? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని గుర్ గామ్ కు చెందిన పాతికేళ్ల శివమ్ తాజాగా ఫ్యాన్ కు ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. తన ఆత్మహత్యకు ముందు తన తండ్రిని ఉద్దేశిస్తూ ఒక లేఖ రాశాడు. దాన్ని తన స్నేహితుడికి పంపాడు. తనను క్షమించాలని.. తన జీవితాన్ని ముగించాలని అనుకుంటున్నట్లుగా పేర్కొంటూ తన తండ్రికి సూసైడ్ నోట రాశారు. శివమ్ పంపిన లేఖను చూసిన స్నేహితుడు వెంటనే అతడి తండ్రి సంజయ్ భాట్నాగర్ కు ఫోన్ చేసి చెప్పారు. ఆయన జాకాబ్ పురలోని ఒక ఆలయంలో ఆర్చకుడిగా పని చేస్తున్నారు.

హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని.. తలుపులు బద్ధలు కొట్టి చూడగా.. ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించాడు శివమ్. వెంటనే అతడ్ని కిందకు దించి చూడగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లుగా గుర్తించారు. ఇదిలా ఉంటే తన కొడుకు ఆత్మహత్యకు ఒక యువతి.. ఆమె కొత్త స్నేహితుడే కారణమని పేర్కొన్నారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకోవటానికి ముందు దాదాపు రెండున్నర గంటల పాటు ఫోన్ లోనే మాట్లాడానని.. ఆ తర్వాతే ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఆరోపించారు. శివమ్ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడి మాజీ ప్రేమికురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.