Begin typing your search above and press return to search.

చాట్ జీపీటీలో అంతరాయం.. దెబ్బకు ఫేక్ క్రియేటర్స్ ఆట కట్!

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు టెక్నాలజీ పేరిట.. మనిషి జీవనాన్ని మరింత సులభం చేస్తూ ఓపెన్ ఏఐ పేరిట ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   4 Sept 2025 12:00 AM IST
చాట్ జీపీటీలో అంతరాయం.. దెబ్బకు ఫేక్ క్రియేటర్స్ ఆట కట్!
X

టెక్నాలజీ పెరిగే కొద్దీ మనిషి యొక్క మేధాశక్తి తగ్గిపోతోందనే వార్తలు ఎప్పటికప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చాలామంది టెక్నాలజీని దృష్టిలో పెట్టుకొని దానిని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. సొంత తెలివితేటలకు పదును పెట్టడం లేదు. మనిషి ఎప్పుడైతే తనను తాను నమ్మడం ఆపేస్తాడో.. అప్పుడే ప్రపంచం కూడా స్తంభించిపోతుంది. మరి ఈ విషయాన్ని ఎందుకు గ్రహించడం లేదో అర్థం కావడం లేదు. వాస్తవానికి జీవన మనుగడకు ఏది ఎంత అవసరమో.. ఆ అవసరాన్ని కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి టెక్నాలజీ పైన ఆధారపడుతూ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నారని చెప్పవచ్చు.

ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇప్పుడు టెక్నాలజీ పేరిట.. మనిషి జీవనాన్ని మరింత సులభం చేస్తూ ఓపెన్ ఏఐ పేరిట ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ టెక్నాలజీను ఉపయోగించి.. కూడికలను మొదలుకొని కోడింగ్ వరకు ఇలా ప్రతి విషయంలో ఏఐ పైనే ఆధారపడడం నిజంగా బాధాకరం అనే చెప్పాలి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే చాట్ జీపీటీని ఓపెన్ ఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. చాట్ బాట్ సహాయంతో యూజర్లు తమకు అవసరమైన ఖచ్చితమైన సమాచారాన్ని చేతివేళ్లలో క్షణాలలోనే పొందుతున్నారు.కానీ సమాచారం పొందడం అటు ఉంచితే.. సొంత తెలివితేటలను మాత్రం పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.

వాస్తవానికి ఈ చాట్ జీపీటీ అవసరం ఎంత మేరకు ఉందో అంత మేరకు ఉపయోగిస్తే ఎటువంటి హాని ఉండదు. కానీ కొంతమంది దీనినే పనిగా పెట్టుకుని సొంతంగా తమ తెలివితేటలను ఉపయోగిస్తున్నామంటూ బిల్డప్ కొట్టే వాళ్లకు ఇప్పుడు షాక్ తగిలిందనే చెప్పాలి. అసలు విషయంలోకి వెళ్తే .. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రజాధారణ పొందిన ఏఐ చాట్ బాట్ చాట్ జీపీటీలో సాంకేతిక లోపం ఏర్పడడం వల్ల సేవలకు అంతరాయం కలిగింది. ఓపెన్ చేస్తుంటే తమకు సమస్యలు ఎదురవుతున్నట్లు భారత్ తో సహా పలు దేశాల యూజర్లు ఫిర్యాదులు చేశారని డౌన్ డిటెక్టర్ వెబ్ సైట్ తాజాగా వెల్లడించింది.

అయితే ఈ చాట్ జీపీటీలో ఏర్పడిన అంతరాయం కారణంగా.. దెబ్బకు ఫేక్ క్రియేటర్స్ ఆటకు చెక్ పడింది అని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ చాట్ జీపీటీ అందుబాటులోకి వచ్చిందో చాలామంది తమ సొంత తెలివితేటలను ఉపయోగించుకోకపోగా.. తామే పెద్ద తోపులం అంటూ పెద్ద ఎత్తున చాలామందిని అపహేళన చేశారు. సొంత తెలివితేటలను పక్కనపెట్టి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తూ కంటెంట్ క్రియేటింగ్ మొదలుకొని, టెక్నికల్ కోడ్ కూడా రాస్తున్నారు. ఇక వీడియోలు చేసేవాళ్లు ఇలా ఎంతోమంది దీనిని ఉపయోగించి పనిచేస్తున్న అందరికీ కూడా ఇప్పుడు భారీ షాక్ తగిలింది. మరి ఇలాంటి సమయంలో ఓన్ కంటెంట్ క్రియేటర్ గా చెప్పుకుంటున్న వారందరూ ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి అని పలువురు కామెంట్లు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.

ఏదేమైనా టెక్నాలజీ అనేది కొంతవరకు ఉపయోగపడుతుందే తప్ప అన్ని విషయాలలో కాదు అని చెప్పవచ్చు. నిజానికి మన దగ్గర టాలెంట్ ఉంటే ఎందులో ఎలాంటి అంతరాయం కలిగిన మనకు పెద్దగా అనిపించదు. కానీ దీని పైన డిపెండ్ అయ్యే కొంతమందికి మాత్రం ఇది భారీ షాక్ అని చెప్పాలి. మరి ఇప్పటికైనా ఓన్ కంటెంట్ క్రియేటర్స్ అని చెప్పుకొని తిరిగే వాళ్ళందరూ సొంత తెలివితేటలను ఉపయోగిస్తారేమో చూడాలి.

మరోవైపు చాట్ జీపీటీ సేవలకు అంతరాయం ఏర్పడడంతో చాలామంది ఫేక్ క్రియేటర్స్ విలవిల్లాడిపోతున్నారు. వరుస మెసేజ్లు పెడుతూ సోషల్ మీడియాను నింపేస్తున్నారు. మరి దీనిపై ఓపెన్ ఏఐ ఎలాంటి వివరాలు వెల్లడిస్తుందో చూడాలి.