Begin typing your search above and press return to search.

సీబీఐ ఎస్పీ.. వివేకా కుమార్తె అల్లుడిపై ఛార్జిషీట్.. ఏముందంటే?

వివేకా హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్.. వివేకా కుమార్తె.. అల్లుడిపై ఛార్జిషీట్ దాఖలు చేవారు.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:44 AM GMT
సీబీఐ ఎస్పీ.. వివేకా కుమార్తె అల్లుడిపై ఛార్జిషీట్.. ఏముందంటే?
X

కీలక పరిణామం చోటు చేసుకుంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసుకు సంబంధించి పులివెందుల అర్బన్ పోలీసులు కోర్టులో ఛార్జిషీటు దాఖలు చేశారు. వివేకా హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ ఎస్పీ రామ్ సింగ్.. వివేకా కుమార్తె.. అల్లుడిపై ఛార్జిషీట్ దాఖలు చేవారు. వివేకా పీఏ క్రిష్ణారెడ్డి కంప్లైంట్ మేరకు వివిధ సెక్షన్ల కింద ఈ నెల 15న కేసు నమోదు చేయటం.. కోర్టు ఆదేశాల మేరకు తాజాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఇంతకూ ఛార్జిషీట్ లో పోలీసులు ఏం పేర్కొన్నారన్నది చూస్తే..

- వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేస్తున్న క్రమంలో వైసీపీకి చెందిన కొందరి పేర్లు చెప్పాలని.. ఈ కేసులో సాక్షిగా ఉండాలని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నాపై పదే పదే ఒత్తిడి తెచ్చారని క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు.

- విచారణకు పిలిచిన సీబీఐ క్యాంపు కార్యాలయంలో నా కొడుకుల ఎదుటే తీవ్రంగా కొట్టారన్న క్రిష్నారెడ్డి

- హైదరాబాద్ లోని సునీత ఇంటికి వెళ్లినప్పుడు ఆమె.. ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిలు నన్ను బెదిరించాడని చెప్పిన క్రిష్ణారెడ్డి

- పులివెందుల కోర్టులో 2021 డిసెంబరులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసినట్లు చెప్పిన క్రిష్ణారెడ్డి

తాజాగా పేర్కొన్న ఛార్జిషీట్ లో పేర్కొన్న అంశాలు ఇలా ఉంటే.. అప్పట్లో పీఏ క్రిష్ణారెడ్డి పులివెందుల కోర్టులో దాఖలు చేసిన ప్రైవేటు ఫిర్యాదుకు సంబంధించి ఈ డిసెంబరు 8న తీర్పు వెలువరించింది. సీబీఐ ఎస్పీ రామ్ సింగ్.. సునీత.. రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన నేపథ్యంలో కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు తాజాగా ఛార్జిషీట్ సిద్ధం చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.