Begin typing your search above and press return to search.

విశాఖలో చరణ్ పొలిటికల్ మీటింగ్... హైదరాబాద్ లో చిరు బిజీ!

ఈ సమయంలో విశాఖలో సినిమాహీరో రామ్ చరణ్ సందడి విశాఖ తీరంలో వైరల్ గా మారింది.

By:  Tupaki Desk   |   15 March 2024 11:27 AM GMT
విశాఖలో చరణ్  పొలిటికల్  మీటింగ్... హైదరాబాద్  లో చిరు బిజీ!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకవైపు పొలిటికల్ సందడి నెలకొంటుంటే.. మరోవైపు సినిమాల సందడి దర్శనమిస్తుంది. ఈ సమయంలో విశాఖలో సినిమాహీరో రామ్ చరణ్ సందడి విశాఖ తీరంలో వైరల్ గా మారింది. "గేమ్ ఛేంజర్" సినిమా షూటింగ్ లో భాగంగా విశాఖలో రామ్ చరణ్ సందడిచేస్తుంటే... ఆయనకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. మరోపక్క చిరంజీవి కూడా తన "విశ్వంభర" విడుదల తేదీని ముందే ప్లాన్ చేసుకుని మరీ బిజీగా షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు.

అవును... ఒకపక్క మెగాస్టార్ చిరంజీవి, మరోపక్క మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు తమ తమ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మెగాస్టార్ "విశ్వంభర", మెగా పవర్ స్టార్ "గేమ్ ఛేంజర్" సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో "విశ్వంభర" షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుండగా.. "గేమ్ ఛేంజర్" షూటింగ్ విశాఖలో జరుగుతుంది.

ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" విషయానికొస్తే... శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ విశాఖలో జరుగుతుంది. ఇందులో భాగంగా ఆర్కే బీచ్ లో ఓపెన్ సెట్ లోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ క్రమంలో... రామ్ చరణ్, ఎస్.జే. సూర్య తదితర కీలక తారాగణంపై ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతుందని.. ఇది మార్చి 19వరకూ జరగనుందని అంటున్నారు.

శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్.. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. ఈ మూవీలోని పొలిటికల్ మీటింగ్ కి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను వైజాగ్ ఆర్‌.కె. బీచ్ లో షూట్ చేస్తున్నారు. ఓపెన్ సెట్ లో రామ్ చరణ్, ఎస్. జె సూర్య తదితరుల ముఖ్య తారాగణంతో శంకర్ ఈ షెడ్యూల్ ని చిత్రీకరిస్తున్నారు. మార్చి 19 వరకు ఈ షెడ్యూల్ జరగనుంది. తాజాగా విడుదలైన ఇక్కడి పిక్స్ లో రామ్ చరణ్.. స్టైలిష్ జెంటిల్ మెన్ లుక్ లో కనిపిస్తున్నారు.

మరోపక్క హైద్రాబాద్ లో చిరంజీవి "విశ్వంభర" యాక్షన్ అడ్వెంచర్ సీన్స్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఒక భారీ యాక్షన్ సన్నివేశాలను పూర్తిచేశారని.. ఈ క్రమంలో మరో యాక్షన్ సన్నివేశాన్ని పూర్తిచేసే పనిలో చిరు ఉన్నారని అంటున్నారు. ఇక త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో భాగంగా జనవరి 10న విడుదల చేయాలని చిరు ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది!