Begin typing your search above and press return to search.

హెచ్1బీ వీసా నమోదు ప్రక్రియలో మార్పులతో తెరపైకి కొత్త విషయం!

ఇందులో భాగంగా... 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే వీసా ఎంపిక ప్రక్రియలో ఒక లబ్ధిదారు అనేక సార్లు ధరఖాస్తులు చేసుకున్నా.. వాటన్నింటినీ ఒకే అప్లికేషన్ గా పరిగణించనున్నారనే విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 March 2024 1:47 PM GMT
హెచ్1బీ వీసా నమోదు ప్రక్రియలో మార్పులతో తెరపైకి కొత్త విషయం!
X

హెచ్‌-1బీ వీసాల నమోదు ప్రక్రియలో మోసాలను అరికట్టేందుకంటూ అగ్రరాజ్యం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 2025 ఆర్థిక సంవత్సరానికి జారీచేసే వీసా ఎంపిక ప్రక్రియలో ఒక లబ్ధిదారు అనేక సార్లు ధరఖాస్తులు చేసుకున్నా.. వాటన్నింటినీ ఒకే అప్లికేషన్ గా పరిగణించనున్నారనే విషయం తెలిసిందే. దీంతో ఈ కొత్త నియమాల ప్రభావం దరఖాస్తుల సంఖ్యపై భారీ ప్రభావమే చూపించిందని తెలుస్తుంది.

అవును... యునైటెడ్ స్టేట్స్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సెర్వీస్ (యూ.ఎస్.సీ.ఐ.ఎస్.) తాజాగా వెల్లడించిన లెక్కల ప్రకారం గత ఏడాది 7,58,994 దరఖాస్తులు అందుకోగా... వాటిలో 4,08,891దఖాస్తులు నకిలీవని తేలిగా... 2025 ఆర్థిక సంవత్సానికి సంబంధించి హెచ్-1బీ వీసాల కోసం సుమారు 3,50,000 మంది దరఖాస్తు చేసుకుంటారని అంచనా వేస్తున్నారు. అంటే... గత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు సగం కంటే తక్కువన్నమాట.

అయితే దీనికంతటికీ కారణం... 2025 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి ఎంపిక ప్రక్రియలో తీసుకొచ్చిన కొత్త నియామలే అని తెలుస్తుంది. ఇక ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభం కాగా.. మార్చి 22న ఈ ప్రక్రియ ముగుస్తుంది. ఇదే క్రమంలో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే వీసా పిటిషన్ల రుసుములను పెంచుతున్న సంగతి తెలిసిందే.

పెరిగిన ఫీజులు:

అమెరికా వీసా దరఖాస్తు ఫీజులు ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భగంగా హెచ్-1బీ వీసాల ఫీజు 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరగగా... ఎల్-1 వీసాలా అప్లికేషన్ ఫీజు $ 460 నుంచి $1,385 కు పెరగా ఓ-1 వీసా ఫీజు 460 డాలర్ల నుంచి 1,055 డాలర్లకు పెరిగింది.