Begin typing your search above and press return to search.

జనవరి 1 నుంచి ఈ మార్పులకు సిద్దమవుతున్నారా?

ముఖ్యంగా బ్యాంకింగ్.. స్టాక్ మార్కెట్.. బ్యాంక్ లాకర్.. ఆధార్.. కొత్త సిమ్ కార్డులు.. ఇలా పలు అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకోన్నాయి.

By:  Tupaki Desk   |   19 Dec 2023 9:30 AM GMT
జనవరి 1 నుంచి ఈ మార్పులకు సిద్దమవుతున్నారా?
X

క్యాలెండర్ లో పాత సంవత్సరం వెళ్లిపోవటం..కొత్త సంవత్సరం వచ్చేయటం ప్రతి ఏడాది జరిగే ప్రాసెస్ కదా? అని అనుకోవచ్చు. కానీ.. అన్ని సంవత్సరాలు ఒకేలా ఉండవన్నది మర్చిపోకూడదు. వచ్చే ఏడాది కూడా అంతే. ఈ ఏడాది డిసెంబరు 31 లోపు వరకు ఉండే కొన్ని కీలక అంశాలు.. జనవరి 1 నుంచి మాత్రం బోలెడన్ని మార్పులు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా మధ్య వయస్కులు.. జీవితంలో సెటిల్ అవుతూ.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం పొందేటోళ్లు.. తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని అంశాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా బ్యాంకింగ్.. స్టాక్ మార్కెట్.. బ్యాంక్ లాకర్.. ఆధార్.. కొత్త సిమ్ కార్డులు.. ఇలా పలు అంశాల్లో కీలక మార్పులు చోటు చేసుకోన్నాయి. వీటిల్లో కొన్నింటిని డిసెంబరు 31 లోపు పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోవద్దు. ఇంతకూ ఆ అంశాలేమిటన్నది చూస్తే..

1. ఆ అకౌంట్ కు నామినీ పక్కా

స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టటం ఇవాల్టి రోజున చాలా కామన్. ఉద్యోగాలు చేసే వారిలో అత్యధికులు స్టాక్ లో కొనుగోళ్లు చేయటం.. పెట్టుబడులు పెట్టటంలాంటివి చేస్తుంటారు. అయితే.. ఇలాంటి వారందరికి డీమ్యాట్ ఖాతా ఒకటి ఓపెన్ చేసి ఉంటారు. ఇలా డీమ్యాట్ అకౌంట్ ఉన్న వారంతా.. డిసెంబరు 31 లోపు తమ ఖాతాకు నామిని ఎవరన్న విషయన్ని స్పష్టంగా పేర్కొనాల్సి ఉంటుంది.

ఒకవేళ అలా చేయకుంటే.. సెబీ ఆదేశాల ప్రకారం డిసెంబరు 31 లోపు నామినీ వివరాల్ని జత చేర్చకపోతే.. స్టాక్స్ ను అమ్మలేరు..కొనలేరు. అందుకే.. తమ డి మ్యాట్ అకౌంట్ ను నామినీ వివరాల్ని జత చేర్చాల్సి లేదంటే..ఖాతాల్ని ఆపరేట్ చేయటం సాధ్యం కాదు.

2. బ్యాంక్ లాకర్ ఉందా? అయితే.. వెంటనే ఇది చేయండి

బ్యాంక్ ఖాతాలు ఉన్న వారందరికి బ్యాంక్ లాకర్ ఉంటుందని చెప్పలేం. కానీ.. కొన్ని వర్గాల వారు తమ బ్యాంక్ అకౌంట్ మాత్రమే కాదు.. తమ ఇంటికి దగ్గర్లోని బ్యాంకుల్లో లాకర్ ను ఓపెన్ చేసుకోవటం తెలిసిందే. అయితే.. ఇలా లాకర్ తీసుకున్నవారు.. బ్యాంక్ తో తాము చేసుకున్న బ్యాంక్ అగ్రిమెంట్ ను డిసెంబరు 31, 2023 లోపు నిబంధనలకు అనుగుణంగా ఒప్పుకుంటున్నట్లుగా చెబుతూ సంతకం చేయాల్సి ఉంటుంది.

అలా కాకుంటే జనవరి ఒకటి నుంచి లాకర్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. అయితే.. దీనికి మరికొంత సమయాన్ని పొడిగిస్తారని చెబుతున్నారు. ఒకవేళ.. అలాంటిది జరగకపోతే ఇబ్బంది అవుతుంది. అందుకే.. ఎవరికి వారు ఎవరికి వారు తమ బ్యాంక్ లాకర్ అకౌంట్ ను మారిన నిబంధనలకు అనుగుణంగా సైన్ చేయటం తప్పనిసరి.

3. ఆధార్ లో మార్పులకు అంత మొత్తం కట్టాల్సిందే

డిసెంబరు 31 ముగిసిన తర్వాత ఆధార్ కార్డులో మార్పులు.. చేర్పులకు సంబంధించి డబ్బులుపే చేయాల్సి ఉంటుంది. అయితే.. దీని సర్వీస్ ఛార్జి రూ.50 తక్కువ మొత్తంగా కనిపించొచ్చు. కానీ.. సగటు జీవికి ఈ మొత్తం ఎక్కువగా అనిపించే వీలుంది. ఎందుకుంటే.. దేశంలోని చాలామంది రోజువారీ కూలీ జనులకు రోజు మొత్తం కష్టపడితే వచ్చేది రూ.178 మాత్రమేనని చెబుతున్నారు. అందుకే.. డిసెంబరు 31 లోపు వరకు ఆధార్ లో ఏవైనా మార్పులు ఉంటే.. చేసుకోవటం మంచిదే.

4. సిమ్ కార్డుల మరింత సులువుగా

వచ్చే జనవరి ఒకటి తర్వాత నుంచి కొత్త సిమ్ కార్డును తీసుకోవాలంటే.. పేపర్ల మీద పేపర్ల అవసరం లేదు. డిజిటల్ ఫార్మాట్ లోకి జనవరి ఒకటి తర్వాత తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా పలు అంశాల్ని డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు. కొత్త సిమ్ కార్డుల్ని మరింత సులువుగా పొందే వీలుందని చెబుతున్నారు. అయితే.. మాటల్లో చెప్పినంత తేలిగ్గా పనులు కావు కదా? అన్న ప్రశ్నను ఎవరికి వారు వేసుకోవటం మంచిది.