Begin typing your search above and press return to search.

చంద్రయాన్ 3 జర్నీ ముగిసింది.. తేల్చేసిన ఇస్రో ప్రముఖుడు!

అన్న ప్రశ్నకు తాజాగా అంతరిక్ష శాస్త్రవేత్త.. ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్ స్పందించారు. చంద్రయాన్ 3 ప్రయోగం ముగిసినట్లేనని పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   7 Oct 2023 4:57 AM GMT
చంద్రయాన్ 3 జర్నీ ముగిసింది.. తేల్చేసిన ఇస్రో ప్రముఖుడు!
X

ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కానిది అతి తక్కువ బడ్జెట్ లో చంద్రుడి దక్షిణ ధ్రువం మీదకు ల్యాండర్ ను పంపిన వైనం తెలిసిందే. చంద్రయాన్ 3 ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ భాగంతో విజయవంతంగా పంపిన విక్రమ్ ల్యాండర్.. ప్రజాన్ రోవర్ లు డీప్ స్లీప్ నుంచి బయటకు వచ్చే సూచనలు కనిపించని పరిస్థితి. భూమి మీద పద్నాలుగు రోజులు చంద్రుడి మీద ఒక రోజుతో సమానం. పద్నాలుగు రోజుల్లో తనకు నిర్దేశించిన పనుల్ని పూర్తి చేయటం తెలిసిందే.

ల్యాండర్ ను.. రోవర్ ను స్లీప్ మోడ్ లోకి పంపిన తర్వాత చంద్రుడి మీద సూర్యోదయం తర్వాత వాటిని మేల్కొపే ప్రక్రియ పెద్ద ఎత్తున జరిగింది. అయినప్పటికి వాటినుంచి ఎలాంటి సానుకూల ఫలితం కనిపించటం లేదు. చంద్రయాన్ 3 ప్రయోగం ముగిసినట్లేనా? అన్న ప్రశ్నకు తాజాగా అంతరిక్ష శాస్త్రవేత్త.. ఇస్రో మాజీ ఛైర్మన్ కిరణ్ కుమార్ స్పందించారు. చంద్రయాన్ 3 ప్రయోగం ముగిసినట్లేనని పేర్కొన్నారు.

ల్యాండర్.. రోవర్ నిద్రాణ స్థితి నుంచి మేల్కొంటాయన్న నమ్మకం తనకు లేదని.. ఒకవేళ మేల్కొనే అవకాశం ఉంటే.. ఇప్పటికే అది జరిగి ఉండేదన్న వ్యాఖ్య చేయటం గమనార్హం. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విశ్లేషించిన ఆయన.. అనుకున్న ఫలితాన్నిఇప్పటికే సాధించామన్న ఆయన.. "ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో దక్షిణ ధ్రువంపై చంద్రయాన్ కాలుమోపింది. ఇప్పటికే విలువైన సమాచారం మనకు అందింది. తదుపరి చేపట్టే ప్రాజెక్టులో ప్లానింగ్ పరంగా ఆ ప్రాంతానికి సంబంధించి మనకు అందిన సమాచారం కచ్ఛితంగా ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో చంద్రుడి నుంచి నమూనాల్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి" అని పేర్కొన్నారు. కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో.. చంద్రయాన్ 3 ప్రయాణం ముగిసినట్లేనని చెప్పక తప్పదు.