Begin typing your search above and press return to search.

మళ్లీ నోటికి పనిచెప్పిన చంద్రశేఖర్... ఈసారి రామాలయంపై!

ఎన్నికలు సమీపుస్తున్న వేళ మోడీ ఆడుతున్న కొత్త స్టంట్ ఇది అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   8 Jan 2024 8:58 AM GMT
మళ్లీ నోటికి పనిచెప్పిన చంద్రశేఖర్... ఈసారి రామాలయంపై!
X

ఓవైపు అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం సమీపిస్తుండగా.. రకరకాల నేతలు, వర్గాల నుంచి విభిన్నమైన కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపుస్తున్న వేళ మోడీ ఆడుతున్న కొత్త స్టంట్ ఇది అని అంటున్నారు. రామాలయం జనవరి 22న ప్రారంభం కానుండగా, దీనికి కొద్ది ముందుగా భారత్ జోడో యాత్ర తతహాలో రాహుల్ గాంధీ జనవరి 14 నుంచి "భారత్ న్యాయ్ యాత్ర" చేపడుతూ దేశానికి ఏమి కావాలనే విషయాన్ని చెప్పాలని ప్రయత్నిస్తున్నారని అంటున్నారు!

ఆ సంగతి అలా ఉంటే... తాజాగా రామ మందిరంపై బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. గతంలో.. మనుస్మృతి, రామచరిత మానస్, గురు గోల్వాల్కర్ పుస్తకాలు ద్వేషాన్ని వ్యాప్తి చేసే పుస్తకాలని.. ద్వేషం దేశాన్ని ఎప్పటికీ గొప్పగా చేయదని.. ప్రేమ మాత్రమే దేశాన్ని గొప్పగా చేస్తుందని వ్యాఖ్యానించిన ఆయన... ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణంపైనా సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.

అవును... సావిత్రి బాయి ఫూలే జయంతి వేడుకల కోసం డెహ్రీ చేరుకున్న బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గుడి దారి మానసిక బానిసత్వానికి బాట అని అన్నారు! పాఠశాలకు దారి వెలుగుకు మార్గం అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... దేశంలోని స్త్రీలు, షెడ్యూల్డ్ కులాలకు విద్యా జ్యోతిని మేల్కొలిపింది సావిత్రి బాయి ఫూలే అని వెల్లడించారు.

ఇదే సమయంలో సావిత్రి బాయి పూలే వల్లనే సమాజంలో షెడ్యూల్డ్ కులాలకు చోటు దక్కిందని చంద్రశేఖర్ తెలిపారు. అదేవిధంగా... విద్య అనేది మీ మీ పిల్లల భవిష్యత్ ను మారుస్తుందని తెలిపిన చంద్రశేఖర్... బాబా అంబేద్కర్ విశ్వాసాలను అనుసరించి రామ మందిరానికి సంబంధించిన అక్షతలను ఇచ్చేవారిని నివారించండి అని పిలుపునిచ్చారని తెలుస్తుంది. గుళ్లపేరుచెప్పి కొంతమంది దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు!

కాగా... మనుస్మృతిని ఎందుకు తగులబెట్టారు..? దేశంలోని మెజారిటీ ప్రజలపై అందులో చాలా దుర్భాషలాడారు. రామచరితమానస్ ఎందుకు వ్యతిరేకించారు? ఈ గ్రంథాల ప్రకారం నిమ్న కులాల వారు విద్యను అభ్యసించడానికి వీలు లేదు. నిమ్న కులాల వారు విద్యను పొందితే విద్య విషతుల్యమవుతారని రామచరితమానస్ లో చెప్పారు. ఇది సమాజంలోని దళితులు, వెనుకబడినవారు, మహిళలు విద్యను పొందకుండా నిరోధిస్తుంది.. అవి సైనైడ్ తో సమానం! అని గతంలో ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.