Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లోకి చంద్రశేఖ రెడ్డి... అల్లు అర్జున్ ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు!

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆరెస్స్ కు వరుస షాక్‌ లు తగులుతున్నాయనే చెప్పాలి.

By:  Tupaki Desk   |   16 Feb 2024 7:16 AM GMT
కాంగ్రెస్  లోకి చంద్రశేఖ రెడ్డి... అల్లు అర్జున్  ప్రచారంపై సంచలన వ్యాఖ్యలు!
X

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీఆరెస్స్ కు వరుస షాక్‌ లు తగులుతున్నాయనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నీకల్లో తగిలిన దెబ్బనుంచి కోలుకోవాలంటే.. కేడర్ లో ఉత్సాహం నింపాలంటే.. నాయకుల్లో పట్టుసడలకుండా ఉండాలంటే అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుపొందాలని బలంగా భావిస్తున్న నేపథ్యంలో గ్యాప్ లేకుండా దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఇవాళ నలుగురు కీలక నేతలు హస్తం తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుండగా... ఈ సమయంలో మరో ముఖ్య నేత షాకిచ్చారు.

అవును... రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీఆరెస్స్ కు వరుస దెబ్బలు తగులుతున్నాయని.. ఒక పద్దతి ప్రకారం బీఆరెస్స్ కు వరుసగా రేవంత్ గాయాలు చేసుకుంటూ వెళ్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ముఖ్య నేత బీఆరెస్స్ కు షాకిచ్చారు. ఇందులో భాగంగా... టాలీవుడ్ టాప్ హీరో అల్లు అర్జున్ స్వయానా పిల్లనిచ్చిన మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి కారు దిగడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ లో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ మేరకు తాజాగా మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన... తాను తెలంగాణ వాదిని అని చెప్పారు. బీఆరెస్స్ లో తనకు తీవ్ర అన్యాయం జరిగిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఇప్పుడు తాను తన పేరెంట్ పార్టీలోకి వెళ్తున్నట్లు తెలిపారు. కారణం... చంద్రశేఖర్ రెడ్డి గతంలో యూత్ కాంగ్రెస్‌ లో పనిచేసినట్లు గుర్తుచేసుకున్నారు. ఇదే సమయంలో తాను కాంగ్రెస్‌ లో చేరిన తర్వాత పార్టీలో సూచనలకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో హైదరాబాద్‌ లోని ప్రతీ గల్లీ గల్లీ అత్నకు తెలుసని చెప్పిన చంద్రశేఖర్ రెడ్డి... అర్బన్ ఓటర్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని అన్నారు. ఇదే సమయంలో... తనకు హైదరాబాద్, మల్కాజ్‌ గిరి... ఏ టికెట్ ఇచ్చినా తనకోసం హీరో అల్లు అర్జున్ తో కలిపి తన కుటుంబ సభ్యులంతా ప్రచారం చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తన అల్లుడు బన్నీ విదేశాల్లో ఉన్నారని ఈ విషయం ఆయనకు ఇంకా చెప్పలేదని అన్నారు. దీంతో... ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

కాగా... గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్స్ నుంచి సాగర్ టికెట్ ఆశించిన చంద్రశేఖర్ రెడ్డికి చివరి నిమిషంలో నిరాశ మిగిలిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో అయినా టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డారని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... తనకు వరుసగా షాకులిస్తున్న బీఆరెస్స్ కు షాకివ్వాలనుకున్నారో ఏమో కానీ... కారు దిగి కాంగ్రెస్ కు చెయ్యి అందించారు!! ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.