Begin typing your search above and press return to search.

ఐదుగురు పారిపోయారు కానీ చంద్రమౌళి దొరికేశారు.. కారణం ఇదే!

ఈ నేపథ్యంలో ఇటీవల ఊరికి వచ్చిన వారు.. కొన్ని రోజులు పేరెంట్స్ తో గడిపి తిరిగి యూఎస్ వెళ్లిపోయారు. అలా పిల్లలు వెళ్లిపోయిన కొద్ది రోజులకు చంద్రమౌళి కశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకున్నారట.

By:  Tupaki Desk   |   23 April 2025 11:28 PM IST
ఐదుగురు పారిపోయారు కానీ చంద్రమౌళి దొరికేశారు.. కారణం ఇదే!
X

జమ్ముకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందగా వారిలో ఇద్దరు తెలుగువారనే సంగతి తెలిసిందే. ఇందులో ఒకరు కావలికి చెందిన మధుసూదన రావు కాగా.. మరొకరు విశాఖకు చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి. ఈ సందర్భంగా చంద్రమౌళి మరణానికి గల కారణాన్ని ఆయన కుటుంబ సభ్యుడు వెళ్లడించారు!

అవును... విశాఖకు చెందిన చంద్రమౌళి దంపతులకు ఇద్దరు కుమార్తెలు కాగా.. వారు అమెరికాలో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఊరికి వచ్చిన వారు.. కొన్ని రోజులు పేరెంట్స్ తో గడిపి తిరిగి యూఎస్ వెళ్లిపోయారు. అలా పిల్లలు వెళ్లిపోయిన కొద్ది రోజులకు చంద్రమౌళి కశ్మీర్ టూర్ ప్లాన్ చేసుకున్నారట.

ఇందులో భాగంగా... చంద్రమౌళి దంపతులు మరో రెండు కుటుంబాలతో కలిసి ఈ నెల 18న కశ్మీర్ వెళ్లారని ఆయన తోడల్లుడు తెలిపారు! ఈ సమయంలో శ్రీనగర్ లో ఉంటూ రోజుకో ప్రాంతంలో పర్యటిస్తున్నారని.. ఈ క్రమంలోనే ఏప్రిల్ 22 మంగళవారం నాడు పహల్గాం వెళ్లారని ఆయన తెలిపారు.

ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో వారంతా పహల్గాం వెళ్లగా.. అనంతరం చంద్రమౌళి ఫ్రెష్ అవ్వడానికి వాష్ రూమ్ కి వెళ్లారని.. ఆయన బయటకు రాగానే కాల్పులు మొదలయ్యాయని తెలిపారు. ఈ సమయంలో.. తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. వెంటాడి మరీ కాల్పులు జరిపారని అన్నారు.

వాస్తవానికి ఆయనతోపాటు మిగిలిన ఐదుగురూ పారిపోయి తప్పించుకున్నారు కానీ.. హార్ట్ ప్రాబ్లం కారణంగా ఆయన ఎక్కువదూరం పరుగెత్తలేకపోయారని.. దీంతో ఉగ్రవాదులు కాల్చి చంపారని చంద్రమౌళి తోడల్లుడు తెలిపారు. అయితే.. దాడి జరిగిన సమయంలో ఆయన మిస్సయ్యారని అనుకున్నాం కానీ.. చనిపోయారనే విషయం తర్వాత తెలిసిందని తెలిపారు.

ఇక ఇప్పటికే చంద్రమౌళి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినట్లు చెప్పిన ఆయన తోడల్లుడు.. బుదవారం రాత్రి ఆయన మృతదేహం విశాఖకు చేరుకుంటుందని.. ఆయన కుమార్తెలు గురువారం సాయంత్రానికి వస్తారని.. అనంతరం పార్వతీపురం తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేస్తారని తెలిపారు.