Begin typing your search above and press return to search.

బీసీలంటే బాబుకు చిన్న చూపు ....విదిలింపుతో సరి...!

బీసీలు అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు మొదటి నుంచి చిన్న చూపే అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   25 Feb 2024 11:51 AM GMT
బీసీలంటే బాబుకు చిన్న చూపు ....విదిలింపుతో సరి...!
X

బీసీలు అంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు మొదటి నుంచి చిన్న చూపే అని అంటున్నారు. ఎన్నికలను ధనస్వామ్యం చేసి డబ్బుతో గెలవగలం అన్నదే ఆయన నమ్మకం అని బీసీ నేతలు విమర్శిస్తున్నారు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు అతి తక్కువ సీట్లు ఇవ్వడం చంద్రబాబుకే సాధ్యమైందని అంటున్నారు.

ఏపీలో సామాజిక వర్గాల పరంగా చూసుకుంటే కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్న కమ్మలకు 21 సీట్లు ఇచ్చిన చంద్రబాబు బీసీలకు మాత్రం 45 శాతం పైగా జనాభాలో ఉంటే 18 సీట్లు మాత్రమే ఇవ్వడాన్ని తప్పు పడుతున్నారు. బీసీల విషయంలో ఎపుడూ చంద్రబాబు నిర్లక్ష్యంగానే ఉంటారు అని అంటున్నారు.

చాలా చోట్ల బీసీల సీట్లలో ఓసీ అభ్యర్ధులను ప్రకటించడాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. బీసీల కంటే డబ్బున్న వారు, కార్పోరేట్ నాయకులు, అగ్ర వర్ణాల వారు మాత్రమే బాబుకు ఎపుడూ కావాల్సి వచ్చారు అని విమర్శిస్తున్నారు.

టీడీపీని స్థాపించిన ఎన్టీయార్ తన హయాంలో ఎపుడూ బీసీలకే పెద్ద పీట వేసేవారు అని గుర్తు చేస్తున్నారు. ఆయన టీడీపీ అధినేతగా ఉండగా ఎంతో మంది బీసీలు, నిమ్న కులాల నాయకులు ఆఖరుకు పెద్దగా డబ్బు ఖర్చు చేయలేని పేదవారు సైతం చట్టసభలకు ఎన్నిక అయ్యేవారు అని గుర్తు చేస్తున్నారు.

అలా ఎన్టీయార్ నాయకత్వంలో టీడీపీ బీసీల పార్టీగా ముద్రపడిందని పేర్కొంటున్నారు. ఇక బీసీలు కూడా టీడీపీని అంతే అస్థాయిలో ఆదరించి మద్దతుగా నిలిచేవారు. అందుకే టీడీపీ ఓట్లూ సీట్లూ ఎపుడూ తగ్గకుండా పార్టీ పటిష్టంగా ఉంటూ వచ్చేదని గుర్తు చేస్తున్నారు.

అయితే చంద్రబాబు నాయకత్వంలోకి టీడీపీ వచ్చాక బీసీలను క్రమంగా పక్కకు పెట్టి కార్పోరేట్ వర్గాలు పెత్తందారీ శక్తులను ముందుకు తీసుకుని రావడం మొదలైందని అంటున్నారు. బీసీలకు రాజకీయంగా ముందు ఉంచి వారికి అవకాశాలు ఇవ్వాల్సిన చోట పక్కన పెట్టడం ఆనవాయితీగా మారిందని అంటున్నారు.

బీసీలకు రాజకీయ అవకాశాలు బాగా తగ్గించి వారిని కేవలం ఓటు బ్యాంక్ గానే వాడుకోవాలన్నది టీడీపీ నయా విధానంగా మారిపోయింది అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే చంద్రబాబు 2024 ఎన్నికల కోసం విడుదల చేసిన 94 మంది అభ్యర్ధుల జాబితా చూస్తే కనుక బీసీలను పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగానే ఉంది అని అంటున్నారు.

బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చిన బాబు మైనారిటీలకు ఒకే ఒక సీటుతో సరిపెట్టారని అంటున్నారు. దీంతో బీసీలు రగిలిపోతున్నారు. టీడీపీ అధినాయకత్వం తమ పట్ల ఉదాశీనంగా ఉండడంతో తాము కూడా సరైన జవాబు చెప్పాలని వారు డిసైడ్ అయ్యారని అంటున్నారు.

ఏపీలో చూస్తే బీసీలు రాజకీయంగా ఇటీవల కాలంలో చైతన్యం అయ్యారు. పూర్వం మాదిరిగా అమయకంగా ఉండడడంలేదు. అంతే కాదు, ఒకరి పల్లకీ మోయడానికి వారు సిద్ధంగాలేరు. తమ ఓట్లు ఎక్కువ అని వారికి బాగా తెలుసు. అదే సమయంలో తమకు సీట్లు కూడా ఎన్ని రావాలో జనాభా ప్రాతిపదికన దామాషా పద్ధతి ప్రకారం కూడా వారు లెక్క వేసుకుంటున్నారు.

ఇక గతంలో తెలుగుదేశం పార్టీ మాత్రమే బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. ఇపుడు అనేక పార్టీలు ముందుకు వచ్చిన నేపధ్యం ఉంది. అలా బీసీలకు రాజకీయంగా తమ నిర్ణయాలను నెగ్గించుకునే అవకాశం ఏర్పడింది. అందుకే పాలు నీళ్లలో తేడా తెలుసుకుంటున్నారు బీసీలు అని విశ్లేషిస్తున్నారు. బీసీలను ఎవరు అదరిస్తారో వారికే అండగా ఉండడం అనేది గత కొన్ని ఎన్నికల నుంచి అంతా చూస్తున్నారు.

అదే సమయంలో తమను పెద్దగా పట్టించుకోని పార్టీలకు సరైన సమయంలో కర్రు కాల్చి వాత పెట్టడంలోనూ వారు ఆరి తేరిపోయారు. బీసీ పార్టీ మాదీ అని బ్రాండ్ తగిలించుకోవడం కాదు అది చేతలలో చూపించలేని టీడీపీ రాజకీయ వ్యూహాలను పసిగట్టి కరెక్ట్ టైం లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.