Begin typing your search above and press return to search.

మద్యం కేసులో చంద్రబాబుకు గుడ్ న్యూస్... లిఖిత పూర్వకంగా చెప్పిన సీఐడీ!

సుమారు 52 రోజులుగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న క్షణం ఈ రోజు ఏపీ హైకోర్టులో ఆవిష్కృతమైంది.

By:  Tupaki Desk   |   31 Oct 2023 10:15 AM GMT
మద్యం కేసులో చంద్రబాబుకు గుడ్  న్యూస్... లిఖిత పూర్వకంగా చెప్పిన సీఐడీ!
X

సుమారు 52 రోజులుగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఎదురుచూస్తున్న క్షణం ఈ రోజు ఏపీ హైకోర్టులో ఆవిష్కృతమైంది. ఇందులో భాగంగా చంద్రబాబుకు షరతులతో కూడిన మధ్యతర బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. దీంతో... అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రోజు సాయంత్రం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి విడుదల అవ్వొచ్చని తెలుస్తుంది. ఈ సమయంలో కేసులకు సంబంధించి బాబుకు మరో బిగ్ అలర్ట్ వచ్చింది.

అవును... స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో తాజాగా మధ్యంతర బెయిల్ పొందిన చంద్రబాబుపై తాజాగా మద్యం కేసు కూడా నమోదైన సంగైతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబును ఏ-3 గా చేరుస్తూ ఏపీ సీఐడీ ఎఫ్.ఐ.ఆర్. కాపీని ఏసీబీ కోర్టుకు సమర్పించింది. దీంతో... ఈ మద్యం కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన అత్యవసర పిటిషన్‌ పై మంగళవారం మధ్యాహ్నం హైకోర్టులో విచారణ జరిగింది.

ఈ సందర్భంగా సీఐడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ .. అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు బెయిల్‌ ఇచ్చినందున... ఆ మధ్యంతర బెయిల్‌ గడువు ముగిసే వరకు అరెస్టు చేయబోమని తెలిపారు. ఈ మేరకు హైకోర్టుకు అడ్వొకేట్‌ జనరల్‌ లిఖిత పూర్వకంగా న్యాయస్థానానికి హామీ ఇచ్చారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు వాయిదా వేసింది. అంటే... ఈ మధ్యంతర బెయిల్ పూర్తయ్యే వరకూ బాబుకు మద్యం కేసు ఎఫెక్ట్ ఉండదన్నమాటే!!

ర్యాలీగా రాజమండ్రి టు అమరావతి:

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు.. అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం జైలు నుంచి ఆయన విడుదలయ్యే అవకాశముందని అంటున్నారు. దీంతో... చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యనేతలు రాజమండ్రికి చేరుకోనున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే జిల్లాల నుంచి నేతలు బయల్దేరారని తెలుస్తుంది.

ఈ క్రమంలో... చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ నుంచి బయటకు బయటకు వచ్చిన అనంతరం ర్యాలీ చేపట్టాలని పార్టీనేతలు నిర్ణయించారని అంటున్నారు. ఇందులో భాగంగా రాజమండ్రి పాత హైవే మీదుగా బయల్దేరి.. వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్‌ జంక్షన్‌, గన్నవరం మీదుగా విజయవాడ రానున్నారు. అనంతరం తన నివాసానికి చేరుకుంటారని అంటున్నారు!