Begin typing your search above and press return to search.

కుప్పం నుంచి బాబు నో...కూటమి కోసం మాస్టర్ ప్లాన్...!?

ఈ నేపధ్యంలో చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసారు అని అంటున్నారు. అదే ఆయన కుప్పం నుంచి ఈసారికి పోటీ చేయకుండా ఉండడం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Feb 2024 4:30 PM GMT
కుప్పం నుంచి  బాబు నో...కూటమి కోసం మాస్టర్ ప్లాన్...!?
X

రాజకీయాల్లో ఆరితేరిన నేత, గండర గండడు అయిన చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఘన విజయం సాధించేందుకు ఒక అద్భుతమైన ప్లాన్ వేసారా అన్న చర్చ సాగుతోంది. ఏపీలో టీడీపీ జనసేన జట్టు కట్టింది. బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు కోసమే టీడీపీ జనసేనతో కూడింది. అయితే కాపు సామాజిక వర్గం పెద్దలు కురు వృద్ధులు అంతా చెప్పేది ఏంటి అంటే పవర్ షేరింగ్ గురించే.

టీడీపీ జనసేన కూటమి అధికారాన్నికి షేర్ చేసుకోవాలని, పవన్ కి కూడా సీఎం పోస్టు విషయంలో వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చంద్రబాబు ఒక మాస్టర్ ప్లాన్ రెడీ చేసారు అని అంటున్నారు. అదే ఆయన కుప్పం నుంచి ఈసారికి పోటీ చేయకుండా ఉండడం అని అంటున్నారు.

అందుకే అక్కడ పర్యటిస్తున్న ఆయన సతీమణి నారా భువనేశ్వరి చేత ఆయన ఒక మాట పలికించారు అని అంటున్నారు. చంద్రబాబు గత ముప్పయి అయిదేళ్ల పాటు పోటీ చేసి రాజకీయాల్లో ఉన్నారు. ఈసారికి ఆయనకు రెస్ట్ ఇద్దామా అని భువనేశ్వరి సభికులను ప్రశ్నించారు. అదే టైం లో తాను పోటీ చేస్తాను అని సరదాగా అన్నారు. అయితే ఆ సరదా వెనక చాలా సీరియస్ వ్యూహం ఉందని అంటున్నారు.

చంద్రబాబుకు ఈసారి కుప్పం కొంత టఫ్ అవుతుంది అని అంటున్నారు. వైసీపీ అక్కడ పంచాయతీ వార్డు నుంచి కూడా అన్నీ గెలిచి బలపడింది. దాంతో పాటు బీసీ ఓటుని టర్న్ చేసుకునే పనిలో పడింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. కుప్పంలో బాబు పోటీ చేస్తే కనీసం చాలా రోజులు అక్కడ తిరిగి ప్రచారంలో ఉండాలి

అదే టైంలో ఏపీలో టీడీపీ కూటమి తరఫున ఆయన ప్రచారం చేయాల్సి ఉంటుంది. దాంతో అభ్యర్ధిగా బాబు ప్రచారంలో ఎక్కువగా పాల్గొనకపోతే ఇబ్బంది అవుతుంది అన్న చర్చ ఉంది. దాంతో పాటు మరొకటి కూడా ఇపుడు వినిపిస్తోంది.

చంద్రబాబు కుప్పం పోటీ నుంచి విరమించుకున్నారు అన్నదే ఆ టాక్. అక్కడ తన సతీమణి భువనేశ్వరిని బరిలోకి దింపి తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం ప్రచారం మాత్రమే చేస్తారు అని. దాని వల్ల టీడీపీ జనసేన కూటమికి విపరీతంగా ప్లస్ అవుతుంది అని అంటున్నారు. జనసేనకు అధికారంలో షేర్ ఇవ్వాలని కాపు సామాజిక వర్గం నేతలు ఎటూ కోరుతున్నారు.

బాబు అసలు పోటీలోనే లేకపోతే వారిలో కొత్త ఆశలు కచ్చితంగా చిగురిస్తాయి. ఇదే అవకాశం, ఎమ్మెల్యేగా బాబు పోటీలో లేరు అంటే పవన్ కే చాన్స్ అని మా పవన్ సీఎం అవడానికి అవకాశం అనుకుని కాపు ఓట్లు పూర్తిగా టీడీపీ జనసేన కూటమికి టర్న్ అవుతాయని అంటున్నారు. ఇక ఎన్నికల తరువాత కూటమి గెలిస్తే అపుడు అటోమేటిక్ గా చంద్రబాబే సీఎం అవుతారు అని అంటున్నారు. అదెలా అంటే ఆయన ఎమ్మెల్సీగా గెలిచి సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు అని అంటున్నారు.

ఇక కుప్పంలో కూడా కొత్త ముఖంగా తన సతీమణి భువనేశ్వరిని ఉంచి అక్కడ కూడా మంచి విజయం అందుకోవచ్చు అన్నది బాబు మరో ఆలోచన అని అంటున్నారు. నిజంగా ఇదే కనుక నిజం అయితే ఒక్క 1985లో తప్ప చంద్రబాబు తన నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా పోటీ చేయని ఎన్నిక 2024 మాత్రమే అవుతుంది అని అంటున్నారు. ఈ రకంగా గాసిప్స్ అయితే ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది చూడాల్సి ఉంది.