Begin typing your search above and press return to search.

పోలీసులు వేధించారు... చంద్రబాబు కీలక వాంగ్మూలం!

ఆదివారం ఉదయం 6 గంటల వరకు రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబు చెప్పారు.

By:  Tupaki Desk   |   12 Sep 2023 4:54 AM GMT
పోలీసులు వేధించారు... చంద్రబాబు కీలక వాంగ్మూలం!
X

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సీఐడీ పోలీసులు శనివారం ఉదయం 6 గంటలకు ఆయన అనుమతితోనే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం నంద్యాల నుంచి విజయవాడకు బాబు కోరిక మేరకు రోడ్డు మార్గంలో తీసుకొచ్చారు. అనంతరం ఆదివారం ఉదయాన్నే ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో తనను మానసికంగా వేధించారని చెబుతున్నారు చంద్రబాబు!

అవును... సీఐడీ కస్టడీలో తనను పోలీసులు మానసికంగా చాలా వేధించారని, ఆదివారం ఉదయం 6 గంటల వరకు రోడ్లపై వాహనంలో తిప్పుతూనే ఉన్నారని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ముందు చంద్రబాబు చెప్పారు. ఇదే సమయంలో తనను విచారం చేస్తున్న దృశ్యాలను దురుద్దేశపూర్వకంగా పోలీసులు ప్రత్యక్ష ప్రసారం చేయించారని ఆరోపించారు.

సీఐడీ కస్టడీలో ఉండగా తనకు ఒక వైద్యుడు పరీక్షలు చేశారని, తర్వాత విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఆ సమయంలో తనకు రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినట్లు పరీక్షల్లో తేలిందని చంద్రబాబు కోర్టుకు తెలిపారు. ఇదే సమయంలో.. తాను బస చేసిన ప్రదేశాన్ని పోలీసులు శుక్రవారం రాత్రి 11 గంటలకు ముట్టడించారని తెలిపినట్లు సమాచారం.

ఇదే క్రమంలో శనివారం ఉదయం న్నుంచి జరిగిన మొత్తం విషయాన్ని న్యాయమూర్తి ముందు చంద్రబాబు సవివరంగా వివరించారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... శనివారం తెల్లవారుజామున ఐదు ఐదున్నర గంటల సమయంలో సీఐడీ డీఐజీ రఘురామిరెడ్డి, కేసు దర్యాప్తు అధికారి ధనుంజయుడు తన దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారని చంద్రబాబు తెలిపారు.

ఆ సమయంలో వారి రాకకు కారణం అడిగితే... అరెస్ట్‌ నోటీసు అందించారని, అయితే ఆ సమయంలో కేసు వివరాలు అడిగితే మాత్రం సమాధానం చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారని తెలుస్తుంది. ఈ సమయంలో పోలీసులు దురుసుగా ప్రవర్తించారా? అనే ప్రశ్నకు... శారీరకంగా ఇబ్బంది పెట్టలేదుగానీ మానసికంగా వేధించారని చంద్రబాబు బదులిచ్చారట.

ఇదే సమయలో తనకు అధికారులు ముందుగా ఎఫ్‌.ఐ.ఆర్‌, అరెస్ట్‌ నోటీసులు ఇచ్చారని.. కోర్టులో హాజరుపరచడానికి ముందు రిమాండ్‌ నోటీసు అందించినట్లు చంద్రబాబు కోర్టుకు తెలిపారు.