Begin typing your search above and press return to search.

వృద్ధుల మీద ప్రతాపం...బాబు బాణం...!

చంద్రబాబు రాజకీయం అంతా వేరే పద్ధతిలో ఉంటుంది అని అంటారు. ఆయన చేతికి మట్టి అంటించుకోకుండా చేయాల్సింది చేస్తారు అని అంటారు

By:  Tupaki Desk   |   31 March 2024 11:15 AM GMT
వృద్ధుల మీద ప్రతాపం...బాబు బాణం...!
X

చంద్రబాబు రాజకీయం అంతా వేరే పద్ధతిలో ఉంటుంది అని అంటారు. ఆయన చేతికి మట్టి అంటించుకోకుండా చేయాల్సింది చేస్తారు అని అంటారు ప్రత్యర్ధులు. వాలంటీర్ల వ్యవస్థ పైన గత నాలుగేళ్లుగా నిప్పులు చెరుగుతూ విషం చిమ్ముతూ వచ్చిన చంద్రబాబు ఎన్నికల వేళ మాత్రం వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.

వారికి ఏకంగా నలకు యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా నెలకు ఆదాయం వచ్చేలా చేస్తానని ఒక వైపు నోటితో చెబుతూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వస్తున్న చంద్రబాబు తన వారితో ఈసీకి ఫిర్యాదు చేయించి వాలంటీర్లను మూడు నెలల పాటు విధులకు దూరంగా పెట్టారని అంటున్నారు.

అంతే కాదు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఇంటికీ సేవలు అందుతున్న వారికి ఇబ్బందులు కలుగజేశారు అని అంటున్నారు. రాజకీయం అంటే ప్రజలకు అందుతున్న సేవలను లేకుండా చేయడం కాదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే నిరు పేదలు వయసు మళ్ళిన పెద్దల పట్ల చంద్రబాబు మళ్ళీ తన అక్కసును వెళ్లగక్కారు అంటున్నారు.

ఏపీలో పేదలకు పెద్ద ఎత్తున సంక్షేమం గత అయిదేళ్లలో సాగుతూ వచ్చింది. ఇపుడు ఎన్నికల సందర్భంగా వాలంటీర్లను దూరం పెట్టాలని విపక్షాలు కోరుతూ వస్తున్నాయి. ఈ మేరకు ఫిర్యాదు చేసి మరీ ఇంటింటికీ వాలంటీర్లు అందించే సేవలని నిలుపు చేయించారు అని అంటున్నారు.

ఒక మెకానిజాన్ని, డోర్ డెలివరీ సిస్టం ని పూర్తిగా కట్ చేశారు అని అంటున్నారు. ఏపీలో వయో వృద్ధులు ఉన్నారు. అలాగే వికలాంగులు ఉన్నారు. వివిధ వర్గాల వారు ఉన్నారు వారు ఠంచనుగా ప్రతీ నెలా పెన్షన్ అందుకుంటూ వస్తున్నారు. వారికి ఇపుడు ఇబ్బంది అవుతోంది అని అంటున్నారు.

ఏప్రిల్ మే నేలలలో మండే ఎండలలో వారు పెన్షన్ కోసం పడిగాపులు పడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం టీడీపీ చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు అని అంటున్నారు. వృద్ధుల వికలాంగులు మండుటెండల్లో ఎంత ఇబ్బంది పడతారన్నది చంద్రబాబుకు సహా విపక్షాలకు అసలు అర్థం కావడం లేదు అని అంటున్నారు.

ఇది చంద్రబాబుకు ఇబ్బంది పెట్టే చర్యగానూ చూస్తున్నారు. దీని వల్ల ఆయన రాజకీయంగా ఏమైనా లబ్ది పొందుతారా అంటే దానికి విరుద్ధంగా వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. ఈ తరహా చర్యల వల్ల వృద్ధులు పెద్ద వారు విపక్షాలను ఏ విధంగా అర్థం చేసుకుంటారు అన్నది కూడా చూడాలని అంటున్నారు.

పేదలకు వ్యతిరేకంగా చంద్రబాబు నిర్ణయాలు విధానాలు ఉంటాయన్నది మరోసారి ఈ విధంగా రుజువు అయింది అని అంటున్నారు. ఇపుడు సామాజిక పెన్షన్లు ఏ విధంగా పంపిణీ చేయాలన్న దాని మీద కూడా ఆల్టర్నేషన్ విధానాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.

దీని మీద కచ్చితంగా టీడీపీకే నష్టం అని అంటున్నారు. వాలంటీర్లను దూరం పెట్టాలని ఏ ఉద్దేశ్యంతో అంటున్నారో కానీ పధకాలు అందుకునే వారి నుంచి వచ్చే వ్యతిరేకతను ఊహించకపోతే బూమరాంగ్ అవుతుంది అని అంటున్నారు. చంద్రబాబు ఈ విధంగా తాను పేదలకు వ్యతిరేకమని పెత్తందారుల పక్షం అని మరోసారి రుజువు చేసుకున్నారు అని అంటున్నారు.

ఏది ఏమైనా సెల్ఫ్ గోల్ చేసుకుంది టీడీపీ అని అంటున్నారు. ఈ రకమైన విధానం వల్ల రాజకీయంగా ఫలితాలు కూడా వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. వాలంటీర్ల మీద ఈసీ చర్యలు తీసుకుందని ఒక వైపు టీడీపీ డబాయిస్తున్నా ఆ పార్టీ మద్దతుదారుల ద్వారానే ఈసీకి దాని కంటే ముందు కోర్టుకు వెళ్ళి వాలంటీర్ల సేవలను లేకుండా కాకుండా చేశారు అని అంటున్నారు.

మొత్తం మీద చంద్రబాబు రాజకీయం ఎలా ఉంది అంటే ఆరు నెలలు సాము చేసి మూలనున్న ముసలమ్మని కొట్టారు అన్నట్లుగా ఇపుడు పెద్దలు వృద్ధుల మీద ప్రతాపం చూపించారు అని వైసీపీ నేతలు అంటున్నారు. మరి దీనికి టీడీపీ ఏ విధంగా సమర్ధించుకుంటూ ముందుకు వెళ్తుందో తెలియదు కానీ అనుకున్నది ఒకటి జరిగేది మరొకటి అన్నట్లుగా అయింది అంటున్నారు.