Begin typing your search above and press return to search.

జగన్ ఆయుధం అదేనట... బాబు స్ట్రాటజీ ఏంటి...!?

ఎన్నికల్లో గెలవడం అంటే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక కొత్తగానే ఉంటుంది. ఎత్తులు జిత్తులు కూడా మార్చాల్సి ఉంటుంది.

By:  Tupaki Desk   |   13 March 2024 3:34 AM GMT
జగన్ ఆయుధం అదేనట... బాబు స్ట్రాటజీ ఏంటి...!?
X

ఎన్నికల్లో గెలవడం అంటే ఏ ఎన్నికకు ఆ ఎన్నిక కొత్తగానే ఉంటుంది. ఎత్తులు జిత్తులు కూడా మార్చాల్సి ఉంటుంది. ఓటు వేసేది ప్రజలే అయినా వేయించుకునే వారు మాత్రం తెర వెనక ఉంటారు. వారే అత్యంత శక్తి సంపన్నులు. ఒక్క రోజు పోలింగ్ ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు గంటలలోగా ఈవీఎం మీట అనుకూలంగా నొక్కితేనే ఏ రాజకీయ పార్టీ పంట అయినా పండేది.

దీనే ఎన్నికల వ్యూహం అంటారు. ఈ వ్యూహం ఊరకే రాదు. దీనికి సామ దాన భేద దండోపాయాలు ఉండాలి. ఇక ఏపీ సీఎం జగన్ ప్రజలను నమ్ముకున్నాను అని అంటున్నారు. తనకు ఏ పార్టీతో పొత్తులు లేవని, స్టార్ క్యాంపెయినర్లు లేనే లేరని సిద్ధం సభలలో జగన్ చెప్పుకున్నారు తన పధకాలను అందుకున్న వారే తనకు ఓటేసి గెలిపిస్తారు అని ఆయన నమ్మకంగా ఉన్నారు.

అయితే దాన్ని విపక్షం నమ్మడంలేదు. జగన్ నమ్ముకున్నది పధకాలను కాదు అక్రమాలను అని ప్రతిపక్షం అంటోంది. చంద్రబాబు అయితే అదే నిజం అంటున్నారు. చేతిలో అధికారం ఉంది కదా అని వైసీపీ అక్రమాలు చేయవచ్చు అనుకుంటోందని కానీ ఒక్కసారి నోటిఫికేషన్ వస్తే చాలు వైసీపీ ఆట బంద్ అని అంటున్నారు. చంద్రబాబు తన పార్టీ వారితో మాట్లాడుతూ మూడు పార్టీలు ఐకమత్యంగా కలసి పనిచేసే వైసీపీని చిత్తుగా ఓడించవచ్చు అని స్పష్టం చేశారు.

వైసీపీకి ప్రజా బలం లేదని జగన్ ఎన్నికల్లో అక్రమాలు చేయడాన్నే నమ్ముకున్నారు ను అని బాబు సంచలన కామెంట్స్ చేశారు. దాన్ని తాము సాగనివ్వమని ఆయన చెప్పారు. నిజానికి బీజేపీతో పొత్తు టీడీపీ ఎందుకు పెట్టుకుంది అన్న దాని మీద కూడా రకరకాలైన విశ్లేషణలు వచ్చాయి.

టీడీపీ పొత్తు పెట్టుకోవడం వెనుక అసలైన కారణం వైసీపీని పూర్తిగా నియంత్రించడానికే అని అంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. కానీ ఎన్నికల నోటిఫికేషన్ తరువాత మొత్తం సీన్ మారుతుందని టీడీపీ భావిస్తోంది. ప్రభుత్వం ఆపద్ధర్మం అవుతుంది. అదే టైం లో అధికారులే ప్రధానం అవుతారు. అపుడు కేంద్రంలో ఉన్న బీజేపీ సాయంతో ఏపీ ప్రభుత్వాన్ని నియంత్రించవచ్చు అన్నదే టీడీపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.

మరి బీజేపీ పొత్తులో ఉంది కానీ ఏపీలో వైసీపీతో 2019 నాటి టీడీపీ మాదిరిగా బద్ధ శతృత్వంతో వ్యవహరిస్తారా అన్నదే డౌట్ అంటున్నారు. బీజేపీ 2019లో మాదిరిగా వ్యవహరిస్తుంది అన్నది టీడీపీ పట్టు గా ఉండవచ్చు. కానీ నాడు చంద్రబాబు తమ నుంచి దూరం అయ్యి నానా విమర్శలు చేశారు అన్నది ఒక కారణం అయితే ఆయన నేరుగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని కేంద్రంలో తమ అధికారాన్నే కాకుండా చేయాలని చూస్తున్నారు అన్నది మరో ఆగ్రహం. అందువల్లనే నవనాడులూ కృంగిపోయేలా నాడు టీడీపీ ప్రభుత్వం మీద కేంద్రం అంతా సాధించింది.

ఇపుడు జగన్ చూస్తే న్యూట్రల్ గా ఉన్నారు. కాంగ్రెస్ తో అసలు ఆయన కలసి వెళ్లే చాన్స్ లేదు. పైగా ఎన్నికల తరూఅత బీజేపీ కోరుకుంటున్న 400 పై చిలుకు నంబర్ కి వైసీపీ అవసరం కూడా ఉండవచ్చు అన్న లెక్కలు ఉన్నాయి. మరి అలా అనుకుంటే బీజేపీ ఏపీ విషయంలో ఎంతవరకూ దూకుడు చేస్తుంది అన్నది ఒక చర్చ. ఏది ఏమైనా జగన్ ని కంట్రోల్ లోకి తెస్తాం, కేవలం రెండు మూడు రోజులు మాత్రమే అని టీడీపీ నేతలు అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.