Begin typing your search above and press return to search.

రుషికొండ టాయిలెట్ పై చంద్రబాబు సెటైర్ వైరల్!

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమవేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   23 July 2024 10:50 AM IST
రుషికొండ టాయిలెట్  పై చంద్రబాబు సెటైర్  వైరల్!
X

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమవేశాలు సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలిరోజు నల్లకండువాలు కప్పుకుని వైసీపీ నేతల నిర్సనలు.. గవర్నర్ ప్రసంగం.. అనంతరం సభ వాయిదా జరగగా... రెండో రోజు సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే, ఏపీ సీఎం మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగింది.

అవును... ఏపీ శాసనసభ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం బయట ప్రపంచానికి తెల్లిసిన రుషికొండ హవనాల వ్యవహారంపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఏపీ సీఎం చంద్రబాబు మధ్య ఈ చర్చ జరిగింది.

ఇందులో భాగంగా... రుషికోండ ప్యాలెస్ కు పబ్లిక్ యాక్సెస్ ను అనుమతించాలని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రతిపదించారు. ఫలితంగా... ఇక్కడి ప్రజలు రూ.25 లక్షల ఖరీదైన టాయిలెట్ ను చూడవచ్చని అన్నారు. దీనికోసం రూ.30 లేదా రూ.50తో తక్కువ ప్రవేశ రుసుము పెట్టాలని సూచించారు.

దీనికి సమాధానంగా స్పందించిన చంద్రబాబు.. "ఇంత ఖరీదైన మరుగుదొడ్డిని నేనెప్పుడూ చూడలేదు!" అని సమాధానం ఇచ్చారు. దీంతో... చంద్రబాబు సెటైరికల్ రియాక్సన్ వైరల్ గా మారింది.

కాగా... జగన్ సర్కార్ హయాంలో రుషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వందల కోట్ల ప్రజాధనాన్ని వారి వారి లగ్జరీల కోసం ఖర్చు చేస్తున్నారంటూ టీడీపీ నేతలు విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత భీమిలి టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు మీడియా సమక్షంలో ఆ రిషికొండ ప్యాలెస్ లను సందర్శించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.