Begin typing your search above and press return to search.

కూటమి తొలి ఏడాది : బాబు మెగా గిఫ్ట్ ఓన్లీ ఫర్ లేడీస్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమయానికి ఏమి చేయాలో బాగా తెలుసు. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టాలని ఆయన అనుకోరు.

By:  Tupaki Desk   |   6 May 2025 2:00 AM IST
కూటమి తొలి ఏడాది : బాబు  మెగా గిఫ్ట్ ఓన్లీ ఫర్ లేడీస్
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏ సమయానికి ఏమి చేయాలో బాగా తెలుసు. అన్నప్రాసన నాడే ఆవకాయ పెట్టాలని ఆయన అనుకోరు. పైగా ఏది చేసినా దానికి ఒక టైమూ టైమింగ్ అన్నది తప్పకుండా ఫాలో అవుతారు. అలా ఆ కార్యక్రమం జనం గుండెలలో ఎప్పుడూ ఉండేలా చూసుకుంటారు.

సూపర్ సిక్స్ అన్నారు సెవెన్ అన్నారు ఏవీ అని వైసీపీ అధినేత జగన్ విపక్ష హోదాలో విమర్శలు చేయవచ్చు. కానీ బాబు వెనకా ముందు సమయం తీసుకోవచ్చు ఏదైనా పధకం అమలు చేశామా లేదా అన్నదే చూసుకుంటారు. అన్నీ ఒక్కసారి ఇచ్చేసి అప్పుల కుప్పగా ఏపీని చేసేసి కాళ్ళూ చేతులూ ఆడకుండా చేసుకోవడం బాబు లాంటి అనుభవజ్ఞుడికి అసలు కుదరని వ్యవహారం.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఒక మహత్తరమైన ఆలోచన చేస్తున్నారు. జూన్ 12తో ఏపీలో టీడీపీ కూటమి పాలన తొలి ఏడాది పూర్తి చేసుకోబోతోంది ఈ సందర్భంగా బాబు భారీ గిఫ్ట్ ని రెడీ చేస్తున్నారు. అది కూడా మహిళల కోసం. ఎన్నికల్లో కూటమి ఒక హామీ ఇచ్చింది. ప్రతీ ఇంట్లో 18 నుంచి 59 ఏళ్ళ మహిళలు ఉంటే వారి ఆర్ధిక ఉన్నతి కోసం ప్రతీ నెలా 1500 రూపాయలు ఇస్తామని చెప్పింది.

ఆ పధకానికి మంచి స్పందన వచ్చింది. మహిళా జనాలు అంతా దీనికి ఆకర్హితులై ఓట్ల వర్షం కురిపించారు. దాంతో ఆ హామీ కోసం గత ఏడాదిగా వారు అంతా చకోర పక్షులు మాదిరిగా ఎదురుచూస్తున్నారు. బాబు ఈ పధకాన్ని కచ్చితంగా అమలు చేస్తారు అని వారికి తెలుసు. అయితే ఎపుడు అన్న దాని మీదనే వారు అంతా తర్జన భర్జన పడుతూనే ప్రభుత్వం మీద కోటి ఆశలు ఉంచారు.

ఇక బాబు ఈ పధకాన్ని ఏడాది పాలన పూర్తి అయిన సందర్భంగా బహు గొప్పగా ప్రకటించాలని నిర్ణయించారు. ఈ పధకం కింద బీసీ, ఎస్సీ ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకే ఈ ఆర్ధిక సాయం అందుతుందని అంటున్నారు. ఇందులో అగ్ర వర్ణాల వారిని మినహాయించారు

మరో వైపు చూస్తే ఈ వర్గాలలో సైతం ఆర్ధికంగా బలంగా ఉన్న వారిని పక్కన పెడుతున్నారు. పైగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి అలాగే పేదరికంతో బాధ పడుతున్న వారికీ అని నిబంధనలు పెట్టబోతున్నారు. అలా చేసినా అత్యధిక శాతం మంది మహిళలు ఈ పధకం కింద అర్హులే అవుతారు అని అంటున్నారు.

నెలకు 1500 అంటే ఏడాదికి 18000 వేల రూపాయలు. ఒక విధంగా మహిళలకు ఈ పధకం అతి పెద్ద ఆలంబనగా నిలుస్తుంది అని అంటున్నారు. నెలకు కచ్చితంగా 1500 ఖాతాలో పడుతుంది అంటే పేద మహిళల జీవితాల్లో ఎంతో కొంత మార్పు వస్తుంది అని అంటున్నారు. వారంతా చంద్రబాబు ప్రభుత్వం పట్ల కృతజ్ఞతగా ఉంటారని వారే అతి పెద్ద ఓటు బ్యాంక్ గా మారుతారని వ్యూహంతోనే ఈ పధకం అమలు చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి కూటమి సర్కార్ తొలి ఏడాది బాబు ఇచ్చే మెగా గిఫ్ట్ ఓన్లీ ఫర్ లేడీస్ గా ఉంది. అలా తన ప్రభుత్వం మహిళా పక్షపాతాన్ని ఆయన రుజువు చేసుకున్నారు అని అంటున్నారు.