'అనంత' నేతలపై టీడీపీ బిగ్ డిబేట్!
``నాయకులు ప్రజల మధ్య ఉండాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేయాలి.
By: Tupaki Desk | 1 July 2025 12:30 AM``నాయకులు ప్రజల మధ్య ఉండాలి. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజలకు పరిచయం చేయాలి. ప్రజల్లో చైతన్యం కలిగించాలని.. తిరిగి మనల్ని గెలిపించాలి..`` ఇదీ.. సీఎం చంద్రబాబు పదే పదే చెబుతున్న మాట. తాజాగా కూడా ఆయన విస్తృత స్థాయి సమావేశంలోనూ ఇదే చెప్పుకొచ్చారు. కానీ, నా యకుల తీరు నాయకులదే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ముఖ్యంగా సీమలోని అనంతపురం జిల్లాలో అయితే.. ఇది మరింత ఎక్కువగా ఉంది.
అనంతపురం జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఎన్ని ఎదురు గాలులు వీచినా.. రాజకీయంగా ఎన్ని ఒడిదు డుకులు వచ్చినా.. ఇక్కడి ప్రజలు టీడీపీతోనే ఉంటున్నారు. 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాలు అనేకం ఉన్నాయి. సీమలోని కర్నూలు, కడపలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక, చిత్తూరులో ఒక్క చంద్రబాబు తప్ప ఇంకెవరూ గెలవలేదు. అలాంటి పరిస్థితిలోనూ కూడా.. అనంతపురంలో రెండు స్థానా లను టీడీపీ కైవసం చేసుకుంది.
అంత బలంగా పార్టీ కేడర్ ఉన్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలాంటి జిల్లాలో ఇప్పుడు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా నాయకులు వ్యవహరిస్తున్నారు. అంతేకాదు.. వారి వారి కుటుంబ సభ్యు లు చక్రాలు, స్టీరింగులు తిప్పుతూ.. అధికార దర్పాన్ని ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఎవరూ తక్కువకాదు. ఒక్కసారి గెలిచిన నాయకులు కూడా ప్రజలకు చేరువ కాలేక పోతున్నా రన్న వాదన ఉంది.
ఈ విషయాలపై చంద్రబాబు తాజాగా నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో చర్చించారు. ఓ మంత్రి సహా.. నలుగురు ఎమ్మెల్యేల పనితీరును ఆయన పూసగుచ్చినట్టు వివరించి.. క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ కాలేక పోతున్న తీరును కూడా వివరించారు. అంతేకాదు.. ఇకనుంచైనా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. మరి ఆ ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకుంటారో లేదో చూడాలి. వీరిలో కల్యాణదుర్గం, పెనుకొండ, పుట్టపర్తి, రాప్తాడు సహా మరో కీలక నియోజకవర్గం కూడా ఉందని(ఇది టీడీపీ కీలక నేతది) బాబు స్వయంగా చెప్పడం గమనార్హం.